అధికార పార్టీకి తొత్తుగా మారిన పోలీసు వ్యవస్థ
== సాయిగణేష్ మరణం పోలీస్ హత్యే..
== విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల, నగర కమిటీ అధ్యక్షుడు జావిద్
(ఖమ్మం-విజయంన్యూస్);-
ఖమ్మం నియోజకవర్గంలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు,రౌడీ షీట్ లు,పిడి యాక్ట్ లు, వేధింపులకు గురిచేస్తున్నారని, పోలీసులు అధికార పార్టీకి తొత్తుగా మారిపోయారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడుఎండి.జావిద్విమ్మర్శించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎల్లకాలం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండదని అనే విషయాన్ని జిల్లా ప్రజాప్రతినిధులు,పోలిస్ అధికారులు గుర్తుంచుకోవాలని సూచించారు. జిల్లా పోలీసు యంత్రాంగంఅధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విపక్ష కార్యకర్త సాయి గణేష్ మృతి చాలా బాధాకరమని దీన్ని పోలీసు హత్యగా భావించాలని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం రౌడీషీట్లు ఓపెన్ చేయడం పీడీ యాక్ట్ లు పెట్టడం టిఆర్ఎస్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని తెలిపారు.
also read;-అసైన్డ్ భూములు గుంజుకుంటే ఆందోళన తప్పదు
తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం నియోజకవర్గం లో జిల్లా పోలీసు యంత్రాంగం అంతా మంత్రి పువ్వాడ కనుసన్నల్లోనే నడుస్తోందని ఆరోపించారు. సామాన్యుడికి ఒక న్యాయం అధికార పార్టీ నేతలకు మరో న్యాయం అన్నట్టుగా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు. ప్రశ్నించే వారిని ఎదుర్కోలేక పోలీసుల అండతో ప్రభుత్వం దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. జిల్లాలో పువ్వాడ అజయ్ అరాచకాలు మితిమీరి పోతున్నాయని అన్నారు. విపక్షం కార్యకర్త సాయి గణేష్ మృతి పై సీబీఐ విచారణ జరిపించాలని సాయి గణేష్ మరణ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు.
also read;-సీతలాదేవి ప్రతిష్ఠ మహోత్సవంలో పొంగులేటి
అంతేకాకుండా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని భవిష్యత్తులో ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా నిలువరించాలని డిమాండ్ చేశారు. ఇలాగే కేసులు బనాయిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని సీరియస్గా భావిస్తుందని పోలీసులపై దాడులకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు కోర్టు ఎన్నిసార్లు మందలించినా ఖమ్మం పోలీసులకి పట్టనట్టు కూడా లేదు సామాన్యులు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి కేసు పెట్టడానికి కూడా భయపడుతున్నారు గతంలో ఎప్పుడూ ఇలాంటి సందర్భాలు చూడలేదు ఖమ్మం పోలీసులపై అనేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమిషన్ లలో కేసులు కలవు అయినా ఖమ్మం పోలీస్ వ్యవస్థ మొత్తం అజయ్ కి తొత్తు గా వ్యవహరించడం చాలా దారుణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.