Telugu News

7 200 టీషర్ట్స్ టోపీ ఆవిష్కరణ

---విద్య వైద్యం ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

0

7 200 టీషర్ట్స్ టోపీ ఆవిష్కరణ

—విద్య వైద్యం ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

—-ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి పుల్లూరి నాగయ్య

(ఖమ్మం-విజయంన్యూస్);-

తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ పుల్లూరి నాగయ్య తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలో తీన్మార్ మల్లన్న రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి, ఫుల్లురి. నాగయ్య నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో 7200 పాదయాత్ర టీ షర్ట్ టోపీ జండా ఆవిష్కరణ చేశారు .

also read :-ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న 7200 పాదయాత్ర సందర్భంగా జిల్లాలో నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీలు పూర్తి చేయాలని వారు పిలుపునిచ్చారు. అలాగే మే 1న జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని , అలాగే త్వరలో తీన్మార్ మల్లన్న పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రజలను ,వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కన్వీనరు కోటేశ్వరరావు, కో కన్వీనర్ దత్తు కిషోర్, పాలేరు నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్, ఖమ్మం రూరల్ కన్వీనర్ మహేష్ ,రఘునాథపల్లి మండల కన్వీనర్ నరష్ ,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.