బహుజన రాజ్యాధికార యాత్రను విజయవంతం చేయాలని సైకిల్ యాత్ర ద్వారా అవగాహన
(ఖమ్మం విజయం న్యూస్ ):-
బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వరంగల్ జిల్లా కిల్లాస్ పూర్ సర్వాయి పాపన్న గౌడ్ జన్మించిన ప్రదేశం నుండి 300 వందల రోజుల బహుజన రాజ్యాధికార యాత్రను మార్చి ఆరువ తారీఖున ప్రారంభించనున్నారని .
also read :-గణపేశ్వరుడి ఆలయానికి పోటెత్తిన జనం
దీని సందర్బంగా ఖమ్మం నగర వాసులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్రను విజయవంతం చేయాలని , సైకిల్ యాత్ర ద్వారా అవగాహన కల్పిస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కుక్కల కృష్ణ తెలిపారు .
ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీలకు న్యాయం జరగాలంటే అది బహుజన సమాజ్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని కావున ప్రతి ఒక్కరూ ఈ యాత్రకు మద్దతు పలకాలని పిలుపు నిచ్చారు . బహుజనులకు రాజ్యాధికారం రావాలన్న , సమసమాజాన్ని నిర్మించాలన్న , రాజకీయాలలో 70శాతం సీట్లు పొందాలన్నా బాసపా వలనే కుదురుతుందని పేర్కొన్నారు . ప్రియదర్శిని , దీపిక , లాలమ్మ , శంకర్ గాంధీ , కోటా రవి , ఉమా మహేందర్ , సిద్ధార్థ , అంబేద్కర్ తదితరులు ఈ సైకిల్ యాత్రకు మద్దతు పలికారు