Telugu News

ఒకే దేశం ఒకే కొనుగోలు విధానం ఉండాలి

==రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరుకు పోరాటం చేస్తాం

0

ఒకే దేశం ఒకే కొనుగోలు విధానం ఉండాలి.

==రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరుకు పోరాటం చేస్తాం.

== కూసుమంచి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నిరసన దీక్ష

(కూసుమంచి-విజయంన్యూస్);-
తెలంగాణ రాష్ట్ర రైతాంగం పై కేంద్ర ప్రభుత్వ కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని, భారతదేశంలో రైతుల పట్ల వివక్షతను తగ్గించుకుని ఒకే విధానం అన్ని రాష్ట్రాలకు అమలు చేయాలని కూసుమంచి ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలసి నిరసన దీక్షలు చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం కూసుమంచి మండల కేంద్రంలోని టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి పెద్దపీట వేస్తూ అండగా ఉంటూ వారికి పంట సహాయం కోసం రైతు బంధు, సాగునీటి కోసం భారీ ప్రాజెక్టులు నిర్మాణం ,మరణించిన రైతు కుటుంబానికి అండగా ఉండేందుకు రైతు బీమా ద్వారా ఆర్దిక సహాయం అందిస్తున్నారని అలానే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని గుర్తు చేశారు.

also read :-నగరాభివృద్ధిలో భాగంగానే రోడ్లు ఎర్పాటు..

ఒక పక్క రాష్ట్రంలో రైతులకు పంట సాగు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి వారికి కేసీఆర్ అండగా ఉండడంతో పంటలు బాగా పండి రైతుల ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొందని రైతులు అందరూ ఆనందోత్సాహాలతో ఉంటుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దానిని జీర్ణించుకోలేక రాష్ట్రం పై వివక్షత చూపిస్తూ రాష్ట్ర రైతాంగం పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు ఒకే దేశం ఒకే కొనుగోలు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా రైతులకు సరైన పథకాలు అమలు చేయడం లేదని రైతు సంక్షేమం లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.

also read:-ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానానికి ఎన్నికల నిర్వాహణకు సిద్దంగా ఉండండి

తెలంగాణ రాష్ట్రం నుండి మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశం అయితే అందులో తెలంగాణ ప్రజల పట్ల, రైతుల పట్ల అవహేళన తో మాట్లాడుతూ నూకలు తినండి మీరు అంటూ ధాన్యం కొనుగోలు విషయం లో వారి పద్ధతి మార్చుకోకుండా మాట్లాడం దురదృష్టకరమన్నారు. ఏదేమైనా రాష్ట్రంలో పండిన మొత్తం వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరుకు ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిరసన, ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష,కార్యదర్శులు వేముల వీరయ్య, ఆసీఫ్ పాషా, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్తియా సెట్రామ్ నాయక్, రైతుబంధు సమితి అధ్యక్షుడు బానోతు రాంకుమార్ నాయక్, జడ్పీటీసీ ఇంటూరి బేబి, స్థానిక పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.