నాపై కక్ష్యకట్టి బద్ద్నాం చేస్తున్నరు
== సూడో చౌదరిలు కలిసి మంత్రిగా తొలగించేందుకే ఈ కుట్ర
== చిన్న సంఘటనను పెద్దదిగా చేస్తున్నరు
== ఏపీలో కమ్మ మంత్రిని పేకేశారు..
== తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క కమ్మ మంత్రిని నేను
== కులమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది
== సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
== తొలిసారిగా కుల ప్రస్తావన చేసిన మంత్రి
== ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కమ్మకుల సంక్షేమ సంఘం
(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-
నన్ను మంత్రి వర్గం నుంచి తొలిగించేందుకు కొంత మంది నాపై కావాలనే కుట్రపన్ని మరీ బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందుకు సూడో చౌదరిలు కొంత మంది సహాకరిస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఏపీలో కమ్మ మంత్రిని తొలగించారని, ఇప్పుడు నాపై అదే కుట్ర జరుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక కమ్మ మంత్రిని నేనేనని, అది కూడా తొలగించేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. మంత్రిగా పనిచేస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ తొలిసారిగా కుల ప్రస్తావన తీసుకొచ్చారు. 8ఏళ్లగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఆయన ఏనాడు కుల ప్రస్తావన తీసుకరాలేదు. కానీ తొలిసారిగా కులప్రస్తావన తీసుకొచ్చారు. కులం అంతా ఒక్కటి కావాలని ఐక్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తన వ్యక్తిగత స్వార్తం కోసం కులాన్ని బద్ద్నాం చేసే హక్కు లేదని కమ్మ సంక్షేమ సంఘం ఖండిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా వైరాలో ఏసీ కమ్మ కల్యాణమండపం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
also read :-టీఆర్ఎస్ ను భూస్తాపితం చేస్తాం
ఖమ్మంకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య అంశం చాలా చిన్నదని అన్నారు. అలాంటి చిన్న సంఘటనను ఆసరగా చేసుకుని కొంత మంది కావాలనే నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆయన ఆత్మహత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయినప్పటికి కావాలనే కొంత మంది నాపై కక్ష్యకట్టి మరి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని, అందుకు కొంత మంది సూడో చౌదరిలు సహాకరిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో కమ్మ మంత్రిని తొలగించారని, ఇప్పుడు నాపై కూడా అదే కుట్ర జరగబోతుందన్నారు. నన్ను మంత్రిగా తొలగించేందుకు కావాల్సిన అన్ని డ్రామలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. అయితే నేను ఎక్కడ తప్పు చేయలేదని, తప్పు చేస్తే శిక్ష్ అర్హుడినేని అన్నారు.
కమ్మ కులంపై కుట్ర జరుగుతున్నట్లు కనిపిస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్మమంత్రిని ఒక్కడినేనేని, నాపై కుట్ర జరుగుతుంటే కమ్మకులస్తులు ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. మనమంతా ఐక్యంగా ఉంటేనే కమ్మకులస్థులపై ఇతర కులస్తులు మనపై ఆరోపణలు నిలిపివేస్తారని, కమ్మసంఘం అభివద్ది చెందుతుందన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 8ఏండ్ల కాలంలో ఏ రోజు కులంపై ప్రస్తావన తీసుకరాని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తొలిసారిగా కులప్రసావన తీసుకరావడంపై పలు అసక్తికరంగా చర్చ జరగుతోంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కొంత సాయిగణేష్ ప్రభావం పడినట్లే కనిపిస్తుందని అంటున్నారు.
also read :-వైయస్సార్సీటీపీ వైయస్ షర్మిల పాదయాత్ర జయప్రదం చెయ్యాలి…
ఇదిలా ఉంటే కమ్మ సంక్షేమ సంఘం బాధ్యులు ఒక లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కమ్మ కులస్తులకు ఏం చేశామని కమ్మకులస్తులు ఐక్యం కావాలి, నీకు సపోర్టు చేయాలని ప్రశ్నించారు. వ్యక్తిగత అభిప్రాయాన్ని నమ్ముకునే పువ్వాడ అజయ్ కుమార్ కు ఎలా అండగా ఉంటామన్నారు. తుమ్మల నాగేశ్వరరావు అభివద్దిని నమ్ముకున్నారని, పువ్వాడ అజయ్ కుమార్ పోలీసులను నమ్మకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసేవారికి కమ్మసంక్షేమ సంఘం మద్దతు తెలుపుతుందన్నారు. దీంతో విమర్శ, ప్రతివిమర్శలా మారింది పరిస్థితి. మొత్తానికి సాయిగణేష్ ఆత్మహత్య విషయం ఇప్పుడే చల్లారేటట్లు కనిపించడం లేదు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏలా ఉంటుందో..?