Telugu News

ఇది ఆర్ఆర్ఆర్ చాయ్..ఎంతో స్పెషలోయ్

టీ పెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి 

0

ఇది ఆర్ఆర్ఆర్ చాయ్..ఎంతో స్పెషలోయ్

== టీ పెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి 

(ఖమ్మం-విజయం న్యూస్)

సీపీఐ, సీపీఎం బలపర్చిన కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి శనివారం ఉదయం ప్రచారం లో భాగంగా.. ఇలా ఓ హోటల్ లో చాయ్ కాచారు. నగరంలోని టీ డీ పీ కార్యాలయం ఎదుట ఉన్న హోటల్ కి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గా ప్రసాద్, సీనియర్ నాయకులు మద్ధినేని స్వర్ణ కుమారి, మువ్వా విజయ్ బాబు, ముద్ధిరెడ్డి నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ తదితరులతో కలిసి వెళ్లారు. అక్కడ..వంట శాల వద్ద గరిట చేతబట్టి సలసలా.. మరుగుతున్న టీ ని చక్కగా కలిపేసి ఆపై ఎంచక్కా..గ్లాస్ లోకి పోసి అందించారు. ఇలా అందరితో మమేకమవుతూ..రఘురాం రెడ్డి తన ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. అక్కడే అల్పాహారం గావించి తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.

ఇది కూడా చదవండి:- భారీ మెజారిటీతో సోనియమ్మ కు కానుకిద్దాం: పొంగులేటి