Telugu News

తీన్మార్ మల్లన్న గెలుపే లక్ష్యం: నవీన్

0

తీన్మార్ మల్లన్న గెలుపే లక్ష్యం: నవీన్

ఏన్కూరు మే 24:

(రిపోర్టర్ – చారి)
ఖమ్మం,నల్గొండ,వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గేలిపే లక్ష్యమని మండల కాంగ్రెస్ నాయకుడు తాళ్లూరి నవీన్ అన్నారు.భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయం అన్నారు.ఎమ్మెల్యే ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపించామని,ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీ వస్తుందని,అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పట్టుదలను స్ఫూర్తిగా తీసుకొని నాయకులు,కార్యకర్తలు కష్టపడితే కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు. ఇందుకోసం పట్టభద్రుల ఇళ్లకు తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి,కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాల్సిన ఆవశ్యకతను తెలియజేయాలని తాళ్లూరి నవీన్ కోరారు.