Telugu News

నా అరెస్టు వెనుక వినయ్ భాస్కర్ కుట్ర

రాజకీయంగా దెబ్బతీసేందుకే

0

నా అరెస్టు వెనుక వినయ్ భాస్కర్ కుట్ర

రాజకీయంగా దెబ్బతీసేందుకే

సంచలన ఆరోపణలు చేసిన గుడిమల్ల రవికుమార్

 

(  వ‌రంగ‌ల్  విజయం న్యూస్):-

రాజ‌కీయంగా త‌న‌ను అణిచివేసేందుకు ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ చీఫ్‌విప్‌ విన‌య్‌భాస్క‌ర్ కుట్ర ప‌న్నుతున్నార‌ని టీఆర్ఎస్ ముఖ్యనేత‌, ప్ర‌ముఖ న్యాయ‌వాది గుడిమ‌ల్ల ర‌వికుమార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న రాజ‌కీయ జీవితాన్ని అంతం చేయాల‌ని విన‌య్‌భాస్క‌ర్ చూస్తున్నార‌ని అన్నారు. న్యాయవాదుల కో ఆపరేటివ్ సొసైటీ స్థల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డ కేసులో హ‌న్మ‌కొండ జిల్లా సుబేదారి స్టేష‌న్ పోలీసులు శుక్ర‌వారం ర‌వికుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈసంద‌ర్భంగా స్టేష‌న్‌కు వ‌చ్చిన ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పేద న్యాయ‌వాదుల‌ను ఆదుకోవాల‌నే సదుద్దేశంతో తాను ముందు ప‌డి న్యాయ‌వాదుల కో ఆప‌రేటివ్ సొసైటీని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు.

also read :-బూర్గంపాడు మండలం రామాపురం గ్రామంలో రైతు గోస దీక్షలో పాల్గొన్న వైఎస్ షర్మిల

2014లో కాజీపేట మండ‌లం మ‌డికొండలో 31ఎకరాల ప్రైవేటు ప‌ట్టా స్థ‌లాన్ని గ‌జం రూ.1200ల‌కే పేద న్యాయ‌వాదుల‌కు కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు. న్యాయ‌విహార్ పేరుతో ఏర్పాటైన సొసైటీలో స‌భ్య‌త్వానికి రూ.10వేలు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. రూ.1200ల‌కే గ‌జం భూమి చొప్పున మొత్తం 300 మందికి ప్లాట్లు కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు. అయితే జాబితా, వివిధ అంశాల ప్రాతిప‌దిక‌న కేటాయింపు చేప‌ట్ట‌గా కొంత‌మందికి ఇవ్వ‌లేక‌పోయామ‌ని వెల్ల‌డించారు. కేవ‌లం 10వేలు క‌ట్టి 10 ల‌క్ష‌లు ప్లాట్లు అడుగుతున్నార‌ని, డ‌బ్బులు క‌ట్టి ప్లాట్లు ద‌క్క‌ని వారికి తిరిగి ఆ మొత్తాన్ని అంద‌జేస్తామ‌ని కూడా చెప్పిన‌ట్లు పేర్కొన్నారు. సొసైటీ స్థ‌లాల కేటాయింపుల్లో ఎక్క‌డా తాను అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాను త‌ప్పు చేస్తే హ‌న్మ‌కొండ చౌర‌స్తాలో ముక్కు నేల‌కు రాయ‌డానికి సిద్ధ‌మ‌ని కూడా స్ప‌ష్టం చేశారు.

also read :-త్వరలో ఓటిటిలోకి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ

సివిల్ కేసును క్రిమిన‌ల్ కేసుగా మార్పించారు..
ఎమ్మెల్యే విన‌య్‌భాస్క‌ర్ పోలీసుల‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చి సివిల్ కేసును క్రిమిన‌ల్ కేసుగా మార్పించార‌ని ర‌వికుమార్ ఆరోపించారు. శుక్ర‌వారం అరెస్ట్ చేస్తు ఓ రెండు రోజులు జైలులో ఉంచ‌వ‌చ్చ‌నే దుర్మార్గ‌పు ఆలోచ‌న‌తోనే ఈ రోజు అరెస్ట్ చేస్తున్నార‌ని అన్నారు. తాను ప‌నిచేస్తున్న సంఘాల‌ను చీల్చేశార‌ని, విడ‌గొట్ట‌డానికి ఎంతో ప్ర‌య‌త్నం చేశార‌ని అన్నారు. ఇది పూర్తిగా రాజ‌కీయంగా అంతం చేసే కుట్ర అంటూ వ్యాఖ్య‌నించారు. ఇది సివిల్ కేసు.. వ‌దిలేయండాన్ని ఉన్న‌తాధికారులు చెప్పినా విన‌కుండా క్రిమిన‌ల్ కేసుగా మార్చిన‌ట్లు పేర్కొన్నారు. కేటీఆర్ ప‌ర్య‌ట‌న ముగిసిన త‌ర్వాతే అరెస్ట్ చేయ‌డం అన్న‌ది వ్యూహాత్మ‌కత‌గా అనిపిస్తోంద‌న్నారు. విన‌య్‌భాస్క‌ర్ రాజ‌కీయ అణిచివేత‌పై ఖ‌చ్చితంగా పోరాటం చేస్తాన‌ని వెల్ల‌డించారు.