గ్రామీణ వైద్యుల సమస్యకు త్వరలోనే పూర్తి స్థాయి పరిష్కారం.. మంత్రి పువ్వాడ.
- సీఎం కేసీఆర్ , వైద్య శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాము.
గ్రామీణ వైద్యుల సమస్యకు త్వరలోనే పూర్తి స్థాయి పరిష్కారం.. మంత్రి పువ్వాడ.
– సీఎం కేసీఆర్ , వైద్య శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాము.
– భారీగా హాజరైన గ్రామీణ వైద్యులు.
– గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మహాసభలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మం :విజయం న్యూస్);-
గ్రామంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యుల సమస్యలన్నింటినీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు . ఆదివారం ఖమ్మం పట్టణం బైపాస్ రోడ్ లో క్రిష్ణ ఫంక్షన్ హాల్ లో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 19వ మహాసభ జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు.
also read;-సాయుధ బలగాలకు 100 రోజుల సెలవులు!
గ్రామీణ వైద్యులకు పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడంతో పాటు చట్టబద్ధత కల్పించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన వైద్యశాఖ అధికారంలో త్వరలోనే కీలక సమావేశం వేయించి అన్ని సమస్యలకు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన గ్రామీణ వైద్యులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, పథకాలను గ్రామీణ వైద్యులకు కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ వేసవిలో గ్రామీణ వైద్యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రిని దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి పువ్వాడ పై విషయాలు మాట్లాడారు.
also read;-టీఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి జరుగుతుంది : నామా నాగేశ్వరరావు
ఈ మహాసభలో జిల్లాల నలుమూలల నుండి భారీ సంఖ్యలో గ్రామీణ వైద్యులు హాజరయ్యారు . సమావేశంలో ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఖమ్మం పట్టణ టి.ఆర్.యస్ అధ్యక్షులు పగడాల నాగరాజు, కార్పొరేటర్ లు దోరేపల్లి శ్వేత, మురళి, ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతారం వెంకటాచారి, ఉపాధ్యక్షులు నాగబాబు సుదర్శన్, గడపల వెంకట్రామయ్య, మణికుమార్, చంద్రారెడ్డి, శ్రీనివాసరావు, పుల్లయ్య, రాష్ట్రఫెడరేషన్ కార్యదర్శి నగేశం, పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ భరత్ బాబు, డాక్టర్ రాజశేఖర్ గౌడ్, డాక్టర్ నాగేశ్వరరావు , వీరేంద్ర చిట్టే, గోపగాని సురేందర్, రాంప్రసాద్, రాజ్ కుమార్, గౌతమ్, బాల భాస్కర్ రెడ్డి, శివ కృష్ణ, శ్రావణి, అభయ హాస్పిటల్ సీఈఓ కరీం, అర్క హాస్పిటల్ సీఈవో ప్రసాద్, గుండాల మండలం నుండి జిల్లా కమిటి టి.రాము, ఎం సత్యం , కే రాములు, మహమూద్, తదితరులు తో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ లు పాల్గొన్నారు.