నేడు జిల్లాలో పొంగులేటి పర్యటన
(ఖమ్మం-విజయం న్యూస్);-
తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.
పర్యటనలో భాగంగా ఉదయం పదకొండు గంటలకు వైరా మండలంలోని గరికపాడు, మధ్యాహ్నం ఒంటిగంటకు బోనకల్ మండల కేంద్రం, మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమలాయపాలెం మండలంలోని రాజరాం, ముజహీద్ పురం, సుద్దవాగు తండా, కాకరవాయి, దమ్మాయిగూడెం గ్రామాలను సందర్శిస్తారన్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే శుభకార్యక్రమాలు, పలు ప్రయివేటు కార్యక్రమాలకు హాజరవుతారని పేర్కొన్నారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో హాజరై పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.