Telugu News

గిరిజనుల ఆశాజ్యోతి మంత్రి అజయ్

★ మంత్రి చొరవతో తీరిన పోడు గోస

0

గిరిజనుల ఆశాజ్యోతి మంత్రి అజయ్

★ మంత్రి చొరవతో తీరిన పోడు గోస

(విజయం న్యూస్):-

అడవిపై ఆధారపడ్డ గిరిజనులకు మేలు చేయాలనే ధృడ నిశ్చయంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో పోడు భూముల సమస్యలకు పరిష్కారం కొరకు నిర్విరామంగా శ్రమిస్తూ పేద గిరిజనులకు అండగా మంత్రి అజయ్ నిలుస్తున్నారు. సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారించే కార్యాచరణలో నిమగ్నం కాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన దృష్టికి వచ్చిన పలు పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తూ గిరిజనులకు భరోసాను ఇస్తున్నారు. అమాయక గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని మంత్రి భావిస్తున్నారు.ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడం, ఇళ్ళ స్థలాల పట్టాలు అందిస్తూ పేదలకు తోడ్పాటు అందిస్తూ వాళ్లకు ఏ కష్టం రాకుండా అండగా ఉంటున్నారు అన్ని విధాలుగా పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్న మంత్రి ఆ దిశగా ప్రతిఒక్కరి జీవనయవన సమస్యలను తీర్చుతున్నారు.

also read;-నాటుసారా మరణాలను సహజ మరణాలంటారా: చంద్రబాబు

ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని గాండ్లగూడెం గ్రామ పరిసర ప్రాంతాలలో అటవీ అధికారులు తీసుకున్నటున్న పలు చర్యలకు పేద గిరిజన పోడు రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి రాగా ఆయన సమస్య పరిష్కారంకు చొరవ చూపారు. జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులను సమస్య పరిష్కారం కొరకు మంత్రి ఆదేశించారు. వెంటనే స్పందించిన అధికారులు స్వయంగా పోడు సాగుదారుల వద్దకు వెళ్లి వారితో చర్చించి అన్నివిధాలుగా అండగా ఉంటామని ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుచుకుంటానని పోడు సాగు దారులకు భరోసా కల్పించారు. రెండు మూడు రోజుల్లోనే వారికి తగిన విధంగా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక చొరవ చూపిన రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు స్థానిక పోడు సాగు దారులు హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు చిన్న పేద కుటుంబాలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాయని పలువురు గిరజనలు హర్షం వ్యక్తం చేశారు.

మనసున్న మాహారాజు మంత్రి అజయ్

– రాందాస్ నాయక్
( పోడు భూమి సాగుదారుడు)

ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన మా కలను సాకారం చేసి మా బతుకు చిత్రాన్ని మార్చిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు జీవితాంతం రుణపడి ఉంటాం. మంచి మనసుతో గిరిజన బిడ్డల సాధక బాధకాలు ను అర్ధం చేసుకుని మా జీవితాల్లో వెలుగులు నింపారు, వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

అందరికీ అండగా మంత్రి అజయ్

– మాలోతు చంద్రకళ
( తెరాస గ్రామ శాఖ కార్యదర్శి )

గిరిజనుల మనోభావాలను గుర్తించి వారి జీవనానికి తోడ్పాటు అందించే సంకల్పంతో పోడు సమస్యకు పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపట్టి చొరవ చూపిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు మా గ్రామ గిరిజనుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు. మంత్రికి మా గిరిజనుల మద్దతు ఎల్లవేళలా ఉంటుంది.