Telugu News

ములుగు ఎమ్మెల్యే సీతక్కను కలిసిన గిరిజన పార్ట్ టైం ఉపాధ్యాయులు

ములుగు విజయం న్యూస్

0

ములుగు ఎమ్మెల్యే సీతక్కను కలిసిన గిరిజన పార్ట్ టైం ఉపాధ్యాయులు

(ములుగు విజయం న్యూస్):-

రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఆర్ రామారావు ఆదేశానుసారం జిఎల్ఏటిఎ (GLATA) జిల్లా, రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ములుగు ఎమ్మెల్యే సీతక్క కలిసిన గిరిజన పార్ట్ టైం ఉపాధ్యాయులు. గిరిజన గురుకుల పాఠశాలలో, కళాశాలలో పనిచేయుచున్న పార్ట్ టైం ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యలను, ఉద్యోగ భద్రత,G.O NO:16ను గిరిజన గురుకులాలలో అమలు పరచకపోవటం, చాలీచాలని వేతనం వంటి అంశాలను ఎమ్మెల్యే సీతక్క కు తెలియజేశారు.

also read :-ఉగాది తర్వాత ఢిల్లీలో రైతు ధర్నా -సీఎం కేసీఆర్

ఎమ్మెల్యే ఈ అంశాలను అధికారుల దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్లి మీకు తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల సుదిమల్ల, సింగరేణికు చెందిన సురేష్ బాబు, వెంకన్న, రామారావు, లింగయ్య, ధర్మరాజు, రమ్య, రమేష్, శారద, హేమచంద్ర, రేవతి, చిట్టి బాబు, దశరథ్, రవి, రాంబాబు, వీరు నాయక్, విజయలక్ష్మి, సుమలత, కవిత తదితరులు పాల్గొన్నారు.