Telugu News

టిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు: కండువ కప్పి స్వాగతం పలికిన రేగా

కృష్ణ, మణుగూరు-విజయంన్యూస్

0

టిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు: కండువ కప్పి స్వాగతం పలికిన రేగా
(కృష్ణ, మణుగూరు-విజయంన్యూస్);-
టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరకలు జరుగుతున్నాయి.. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆళ్లపల్లి మండలం లోని పలు గ్రామాలకు చెందిన సుమారు 25 కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది, పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు…

also read :-కొంచెం సృజనాత్మకతతో ఆలోచించండి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అన్ని వర్గాల ప్రజలకు టిఆర్ఎస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని ప్రతి ఒక్క కార్యకర్త కు టిఆర్ఎస్ పార్టీ జెండానే శ్రీరామరక్ష అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోతు అభివృద్ధిలో సీఎం కేసీఆర్ గారి నేతృత్వం లో దూసుకుపోతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. శ్రమించి పని చేసే ప్రతి కార్యకర్త కి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు.

also read :-బహుజన రాజ్యాధికార యాత్రను విజయవంతం చేయాలని సైకిల్ యాత్ర ద్వారా అవగాహన

రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ వైపు పరుగులు పెడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.