గిరిజనులను మోసం చేసింది టీఆర్ఎస్
== టీఆర్ఎస్ సర్కార్ ను గద్దె దించి , బుద్ధి చెప్పేంత వరకు పోరాడతాం
== నంగారా బేరి లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బెల్లయ్య నాయక్
(ఖమ్మం-విజయంన్యూస్);-
గిరిజనులను మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ అని, ఆ పార్టీని, వాళ్ల సర్కార్ ను గద్దెదించే వరకు గిరిజనుల తరుపున పోరాటం చేస్తామని కాంగ్రెస్ పారట్ నాయకులు, నంగారాబేరి లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బెల్లయ్యనాయక్ అన్నారు నగరంలో ఆదివారం నంగారా బేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య బిక్షపతి రాథోడ్ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నంగారా బేరి లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బెల్లయ్య నాయక్ పాల్గొని మాట్లాడారు .
also read :-కామాంధుడి బారి నుంచి కాపాడాలంటూ యువతి ఆర్తనాదాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తూ… ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయటం గిరిజన జాతికి తీవ్ర నష్టం చేస్తుందని వారు వాపోయారు . అందులో భాగంగానే ప్రస్తుతం 6% శాతం ఉన్న రిజర్వేషన్ను 9.9 శాతం పెంచుతామని హామీ ఇచ్చి అసెంబ్లీలో ఎస్టీ బిల్లును తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపకుండా మరొకసారి మోసం చేసిందని అన్నారు . అదేవిధంగా పోడు భూముల విషయంలో గానీ , జీవో నెంబర్ విషయంలోగాని 170 యాక్ట్ ని గిరిజన హక్కులను కావాలనే కాలరాస్తూ గిరిజన రాజకీయ నాయకులను మభ్యపెడుతూ మోసం చేసినట్టు కనబడకుండా మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు అవసరం ఎంతైనా ఉందని వారు సూచించారు .
also read :-చింతకాని దళితులకు శుభవార్త
ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని తండాలలో నంగారా బేరి లంబాడి హక్కుల పోరాట సమితి కార్యకర్తలు ప్రతి తండాలో ప్రతి గిరిజన కుటుంబాన్ని , గిరిజన విద్యార్థిని , విద్యార్థులను చైతన్యపరిచి మండలలలో జిల్లాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి గిరిజనులు చైతన్యపరిచి ఈనెల 20వ తారీఖున హైదరాబాద్లో బహిరంగ సభను జయప్రదం చేయాలని సూచించారు . అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి 25వ స్వర్ణ ఉత్సవాలను రద్దు చేసి ఈ గిరిజన హక్కులను కాపాడుకోవడం కోసం , తండాలో పంచాయితీలను ఏవిధంగా సాధించుకున్నామో అదే విధంగా ఈ రిజర్వేషన్ సాధించుకోవడానికి 10లక్షల మంది ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రతి కుటుంబంలో ప్రతి గిరిజన బిడ్డ వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిచంద్ర చౌహాన్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు బిక్షం నాయక్ , ఖమ్మం జిల్లా అధ్యక్షులు మోతిలాల్ నాయక్ , జిల్లా కార్యదర్శి రాంబాబు నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు.