Telugu News

కేంద్రంతో ప్రత్యక్షపోరాటంలో టిఆర్‌ఎస్‌

** వాయిదా తీర్మానాలతో ఇరుకున పెట్టే యత్నం

0

కేంద్రంతో ప్రత్యక్షపోరాటంలో టిఆర్‌ఎస్‌

** వాయిదా తీర్మానాలతో ఇరుకున పెట్టే యత్నం

** ఎస్సీ వర్గకణ సమస్యపై చర్చకు పట్టు

** చర్చకు తిరస్కరణతో పార్లమెంట్‌ నుంచి వాకౌట్‌

** 8ఏళ్లుగా వర్గగీకరణను కేంద్రం తొక్కిపెట్టింది

** మీడియా సమావేశంలో టిఆర్‌ఎస్‌ ఎంపిల విమర్శలు

(న్యూఢిల్లీ-విజయంన్యూస్);-
కేంద్రంతో అవిూతువిూకి సిద్దమయిన టిఆర్‌ఎస్‌ రోజుకో సమస్యతో పార్లమెంటులో వాయిదా తీర్మానాలతో ఇరుకున పెడుతోంది. ప్రజా సమస్యలే లక్ష్యంగా బాణాలు ఎక్కుపెడుతోంది. వరుసగా వాయిదా తీర్మానాలను ప్రతిపాదిస్తూ చర్చలకు డిమాండ్‌ చేస్తోంది. తాజాగా షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణపై చర్చించాలని పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణ చాలా ఏండ్లుగా పెండిరగ్‌లో ఉన్నదని, ఉభయ సభల్లో కార్యకలా పాలు సస్పెండ్‌ చేసి ఈ అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానంలో లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. ఇదే అంశంపై రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ నేత కే కేశవరావు నోటీసులు ఇచ్చారు. వర్గీకరణతో వారి జనాభా ప్రకారం చట్టబద్ధమైన ప్రయోజనాలు అందేలా, వెనుకబాటు దనాన్ని దూరం చేసేందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

also read :-మల్టీస్టార్‌ అంటే వెంకటేష్‌

అయితే చర్చకు తిరస్కరించడంతో లోక్‌సభ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీలు వాకౌట్‌ చేశారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామ నాగేశ్వరరావు ఎస్సీ వర్గీకరణపై స్పీకర్‌ ఓం బిర్లాకు వాయిదా తీర్మానం నోటీసులు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ అసెంబ్లీ పంపించిన ఎస్సీ వర్గీకరణ తీర్మాననీపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నదని ఎంపీ నామ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని వాయిదా తీర్మానంలో ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ విషయం చాలా ముఖ్యమైనదని.. ఈ అంశంపై సభ చర్చించాలని ప్రత్యేకనీగా స్పీకర్‌కి విజ్ఞప్తి చేశారు.

also read :-సీఎల్పీ నేత భట్టిని అభినందించిన సోనియా, రాహుల్

వాయిదా తీర్మానానికి అనుమతి నిరాకరించిన స్పీకర్‌ ఓం బిర్లా టీఆర్‌ఎస్‌ ఎంపీలు వాకౌట్‌ చేశారు. అలాగే రాజ్యసభలోనూ ఎంపిలు వాకౌట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలపై పార్లమెంటు ఉభయ సభల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు పోరాడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న చమురు ధరలపై కాంగ్రెస్‌ ఎంపీ మానికం ఠాగోర్‌ వాయిదా తీర్మానం ఇచ్చారు. అనంతరం టిఆర్‌ఎస్‌ ఎంపిలు విూడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసి పంపిన ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని.. కేంద్ర ప్రభుత్వం 8 ఏళ్లుగా తొక్కిపెట్టిందని తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరావు ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై తేల్చాలంటూ తెరాస ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ తిరస్కరించారని.. అందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేసినట్లు చెప్పారు.

also read :-రాహుల్ ఉద్యమానికి భట్టి మద్దతు

100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని అధికారంలోకి వచ్చిన భాజపా… 8 ఏళ్లుగా అణగారిన వర్గాలను మోసం చేస్తోందని నామ నాగేశ్వరరావు విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని 8 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీర్మానాన్ని తొక్కిపెట్టింది. 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఎన్నికల్లో భాజపా హావిూ ఇచ్చింది. వర్గీకరణ చేయకుండా ఎస్సీలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. ఎస్సీ వర్గీకరణ అధికారం కేంద్రం చేతుల్లో ఉంది. కేంద్రానికి చేతకాకుంటే రాష్టాల్రకు అధికారం అప్పగించండి. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ అనేక సార్లు లేఖలు రాశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మాయమాటలతో కేంద్రం నెట్టుకొస్తోంది. కేంద్రం వైఖరిని ఎస్సీ వర్గాలు గమనించి గుణపాఠం చెప్పాలి. దళిత బంధు తరహాలో కేంద్రం కూడా ఎస్సీలకు పథకం ప్రవేశపెట్టాలని నామా డిమాండ్‌ చేశారు. విూడియా
సమావేశంలో కె. కేశవరావు, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.