నాయకన్ గూడెంలో నల్లజెండాలను ఎగరేసిన టీఆర్ఎస్ నేతలు
(కూసుమంచి-విజయంన్యూస్);-
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు కూసుమంచి మండలం , నాయకన్ గూడేం గ్రామములో గ్రామ సర్పంచ్ కాసాని సైదులు, వైస్ ఎంపీపీ కంచర్ల పద్మ, రైతు బందు జిల్లా సభ్యులు కంచర్ల వీరా రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పై ” రైతు నిరసన కార్యక్రమం” లో భాగంగా శుక్రవారం రైతులు , తెరాస నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి గ్రామ పంచాయితీ లో రైతుల ఇళ్ళ పైన నల్ల జెండా ఎగరేసి నిరసన తెలియజేశారు.
also read :-కార్పొరేట్ గద్దల సేవలో ఢిల్లీ పెద్దలు
ఈ కార్యక్రమంలో రైతు బందు జిల్లా సభ్యులు కంచర్ల వీరా రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు ఎండీ. జహంగీర్ షరీఫ్, రైతు బందు కన్వినర్ వీర నాగులు, వార్డు సభ్యురాలు ఫాతిమ, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి చిలకబత్తిని నాగరాజు,పాలేరు మాజీ సొసైటీ చైర్మన్ పిల్లి రాంబాబు, కందిబండ శ్రీధర్, బుడిగె వెంకన్న,బింగి ఉప్పయ్య, కంచర్ల నరేందర్ రెడ్డి, చిలకబత్తిని రాములు, రామి రెడ్డి,పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు .