Telugu News

అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిలిచిన సీఎం కేసీఆర్

టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌రరావు

0

అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిలిచిన సీఎం కేసీఆర్

—టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌రరావు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్);-
రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకునేది రైతు పక్షపాతి అయిన ఒక్క కేసీఆర్ మాత్రమేన‌ని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణ యాసంగి వరిధాన్యం కొనమని కేంద్రంలోని బాధ్యతారాహిత్యమైన బీజేపీ ప్రభుత్వం తెగేసి చెప్పినా అన్న‌దాత‌ల‌కు సీఎం అండ‌గా నిలిచార‌ని అన్నారు.

తెలంగాణ రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, అన్నం పెట్టే రైతన్న ఆగం కావొద్దని ముఖ్యమంత్రి కేసిఆర్ తన గొప్ప మనసుతో చివరి గింజ వరకు కొంటామని చెప్పడం హర్షణీయంమ‌ని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ మీడియా స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌ల త‌ర్వాత ఎంపీ నామ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

also read;-జీవో నెంబర్ 111 ఎత్తివేతకు కేబినెట్‌ ఆమోదం..

రైతులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని యావత్ తెలంగాణ రైతాంగానికి భరోసానిచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతన్నలు ఇకనైనా ఆలోచన చేయాలని సూచ‌న చేశారు. కేంద్రంతో ధాన్యం కొనిపిస్తాం వరి వేయండని రెచ్చగొట్టిన బీజేపీ నాయకులు చేతులెత్తేసి, పత్తా లేకుండా పోయారని వ్యాఖ్యానించారు. వారి ఓట్ల కుటిల రాజకీయ మాటలు అర్దం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఉండగా తెలంగాణకు ఏమీ కాద‌ని స్ప‌ష్టం చేశారు.