Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
ఏడేళ్ళు గడిచిన స్వంత క్యాడర్ లేని టి.అర్.ఎస్
* ఈ సారీ ఉద్యమ కారులకు మొండి చెయ్యి
(అశ్వారావుపేట- విజయం న్యూస్)
టిఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలలో భాగంగా మండల అద్యక్షుల ఎన్నికలు పూర్తి అయ్యాయి.ఎక్కడ కూడా అభ్యర్దులనుప్రకటించలేదు.అన్ని చోట్ల కార్యకర్తలు వర్గాల విడిపోయి,ఎవరి అభ్యర్దిని వారుబలపరచారు. పరిశీలకులుగా వచ్చిన నూకల నరేష్ రెడ్డి గానీ, ఎమ్.ఎల్.ఎ గానీ నచ్చచెప్పటం జరగలేదు. ఎన్నికలు నిర్వహించకుండా పేర్లను అధిష్టానానికి పంపిస్తామని,ఎమ్.ఎల్.ఎ.నిర్ణయా నికి కట్టుబడి ఉండాలని చెప్పటం ,సీల్డ్ కవర్ సంస్క్రతి కి తెర తీసి నట్లు అయ్యిందని పలువురు ఆ పార్టీనాయకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచి పార్టీ జెండా మోసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నియోజకవర్గ నాయకులకు సంస్థాగత ఎన్నికలలో కూడా పదవులు రాకపోవడంతో ఆ పార్టీ ఉద్యమకారులు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ స్థాపించన దగ్గర నుండి నేటి వరకు ఆ పార్టీలో కొనసాగుతున్న ఉద్యమకారులకు కనీసం నామినేటెడ్ పదవులు కూడా కట్టపెట్టడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటాలు చేసిన ఫలితం కూడా ఆ నాయకులకు ఫలించలేదంటా..? నియోజకవర్గ వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష పదవి రేసులో ఒక్క ఉద్యమకారుడు పేరు కూడా ప్రస్తావన లేకపోవడం గమనార్హం. వేరే పార్టీల నుండి వలస వచ్చిన నాయకులకే క్యాడర్ మొగ్గు చూపడంతో ఉద్యమకారులు పరిస్థితి దయనీయంగా తయారైంది. రానున్న రోజుల్లో ఏదైనా పార్టీ నియోజకవర్గంలో పటిష్ట బలం సమకూర్చుకొని రానున్న ఎన్నికలలో విజయం సాధిస్తే ప్రస్తుతం టీఆర్ఎస్ లొ కొనసాగుతున్న టి.డి.పి,కాంగ్రెస్ క్యాడర్ వేరే పార్టీలోకి వెళ్లిపోతారననే మాట నియోజకవర్గ వ్యాప్తంగా చర్చజరుగుతుంది.
మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన నాయకులు మాత్రం ఏలాంటి పదవులు కట్టబెట్టకపోవడంతో సీనియర్ టిఆర్ఎస్ నాయకులు తమ పడ్డ కష్టానికి ఫలితం లేదని వాపోతున్నారు. మొదటినుంచి టిఆర్ఎస్ పార్టీలో ఉండి ఆ రోజుల్లో అన్నీ తామై నడిపించిన మేము వలస వారి అడుగుజాడల్లో నడవాల్సిన పరిస్థితి నెలకొంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు అప్పటి రోజుల్లో రోడ్లపైతాము దీక్ష చేస్తుంటే తమను చూసి హేళన చేశారని, కానీ ప్రస్తుతం వారే పార్టీలో ఉంటూ తమకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు ఏదో ఒక మండల పదవులు ఇవ్వాలని కోరుకొంటున్నారు..

Vijayam Daily (విజయం డైలీ) is a Telugu News Network, Vijayamdaily News provide Latest and Breaking News in Telugu (తెలుగు ముఖ్యాంశాలు, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్). Vijayam Daily brings the latest Andhra Pradesh news headlines, Telugu News and Live News Updates on Telangana. Find Telugu Latest News, Videos & Pictures on Telugu and see latest updates only on vijayamdaily.com