Telugu News

నేడు జిల్లాలో ఇధ్దరు మంత్రుల పర్యటన

వైరా నియోజకవర్గంలో పర్యటించనున్న శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్

0

నేడు జిల్లాలో ఇధ్దరు మంత్రుల పర్యటన
== వైరా నియోజకవర్గంలో పర్యటించనున్న శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్
== ఏర్పాట్లు చేస్తున్న అధికారులు, టీఆర్ఎస్ నాయకులు
(వైరా,ఖమ్మం-విజయంన్యూస్);-
ఖమ్మం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఆదివారం పర్యటించనున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తో ఇద్దరు కలిసి వైరా నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వైరా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం 11.00 గంటలకు వైరా రిజర్వాయర్ లో బోటింగ్ ఆపరేషన్ ను ప్రారంభించనున్నారు.

also read :-కేసీఆర్‌ నాయకత్వంలో విద్యాయజ్ఞం :మంత్రి సబితా

అనంతరం ఉదయం 11.30గంటలకు
వైరా పట్టణంలో ఇండోర్ స్టేడియంను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన కార్య్రమంలో పాల్గొంటారు.