Telugu News

తెరసా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్రమోడి దిష్టిబొమ్మ దహనం

( నుగూరు వెంకటాపుర-విజయం న్యూస్)

0

తెరసా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్రమోడి దిష్టిబొమ్మ దహనం

( నుగూరు వెంకటాపుర0-విజయం న్యూస్);-

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బుధవారం ప్రధాన మంత్రి మోడీ దిష్టిబొమ్మను దగ్దం చేసారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ బిల్లుపై అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఏళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎస్సీ ఎస్టీ బిల్లుపై ఒక స్వస్థత ఇవ్వకపోవడం పట్ల టిఆర్ఎస్ ఆందోళన వ్యక్తం పార్టీ చేశారు

ALSO READ;-కేంద్ర గిరిజ‌న సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వర్  పై టీఆర్ఎస్ ఎంపీల ప్రివిలేజ్ మోష‌న్‌

పార్లమెంట్లో బిల్లు పెట్టకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలొ పండించిన ప్రతి వరి ధాన్యం గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేనిపక్షంలో దశలవారీ ఉద్యమాలు చేపడతామని అన్నారు

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప రాంబాబు ప్రధాన కార్యదర్శి పిల్లారిశెట్టి మురళి జాగృతి మండల అధ్యక్షుడు బాలసాని వేణు అధికార ప్రతినిధి దామోదర్ , సీనియర్ నాయకులు అచ్చ నాగేశ్వరరావు,ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు,టౌన్ ప్రెసిడెంటు నగేష్ జాగరశాంత మూర్తి యాదవ్ మద్దుకూరి ప్రసాద్ వార్డు సభ్యులు మోహన్ యూత్ ప్రెసిడెంట్ శివ కృష్ణ నానిటిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు మాధురి మహిళా కార్యదర్శి రమ్యడాక్టర్ వెంకటేశ్వర్లు ఎల్లారావు శ్రీను జయరాజు కిరణ్ తదితరులు పాల్గొన్నారు