రైతు భీమా కోసం లంచం అడిగిన వైనం….
రు. 15000 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నా అవినీతి నిరోధక శాఖ అధికారులు...
రైతు భీమా కోసం లంచం అడిగిన వైనం….
****రు. 15000 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నా అవినీతి నిరోధక శాఖ అధికారులు…
****రైతు వేదికలు… లంచాలకు కేంద్రాలుగా మారాయి…,
****ఎంత మందిని అరెస్ట్ చేసిన గాని తీరుమారని వ్యవసాయ శాఖ అధికారుల తీరు
****జలగల్లా పీడిస్తున్న పేదల రక్తం…
( జూలూరుపాడు – చండ్రుగొండ విజయం న్యూస్ );-
ఎంత మంది అవినీతి అధికారులను కటకటాల పాలు చేసిన లంచగొండి అధికారులో మార్పు రావడం లేదు.
సామాన్య ప్రజల్ని జలగలు పట్టి పీడించి నట్లే అవినీతి అధికారులు పీడిస్తూనే ఉన్నారు.అలాంటి సంఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు రైతు వేదిక లో చోటుచేసుకుంది.
also read;-ఢిల్లీ కి వెళ్తున్న కే సి ఆర్ వైద్యం కోసం
అన్నారు పాడు గ్రామానికి చెందిన బానోతు నాగ్య అనే రైతు భార్య చిల్కి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది ఈ నేపథ్యంలో తన భార్య పేరు మీద పట్టా పాసు బుక్ ఉండడంతో రైతు బీమా వస్తుందని తన కుమారుడిని AEO మణికంఠ వద్దకు పంపగా అతను 30 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు అయితే తాము అంత మొత్తం ఇచ్చుకోలేమని 15000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు రైతు తెలిపాడు.
also read;-వరంగల్లో రెండు రోజుల పాటు ఘనంగా రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ0
అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు రైతు పేర్కొన్నాడు.ఈ నేపథ్యంలోఏసీబీడీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో పాపకొల్లు రైతు వేదికలో రైతు వద్ద నుండి 15 వేల రూపాయలులంచంతీసుకుంటుండగా దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.అదేవిధంగా మణికంఠ నివసిస్తున్న సుజాతనగర్ గ్రామంలో ఇంటి పైన తన స్వగ్రామమైన అశ్వరావుపేట లో సైతం దాడులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవడం మన హక్కు అని ఎవరైనా లంచాలు అడిగితే తమని ఆశ్రయించవచ్చని ఆయన వెల్లడించారు.