ఇండ్లను కూల్చవద్దని సెలైన్ పెట్టుకుని బాధితులు ధర్నా
(నేలకొండపల్లి/కూసుమంచి-విజయం న్యూస్)
ఖమ్మం జిల్లా,నేలకొండపల్లి మండల కేంద్రంలో పాత బస్టాండ్ చెరువు కట్ట దగ్గర పేదల ఇండ్లను కూల్చి వేతను ఆపాలని,ఏప్రిల్ 7న గురువారం వినూత్నంగా ధర్నా నిర్వహించారు. బాధితుడు గూడెల్లి పెద్ద వెంకన్నకు ఎండ దెబ్బ తగిలినా ధర్నాలో సెలైన్ పెట్టుకుని పాల్గొన్నాడు. ఈ ధర్నాకు సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా పాలేరు డివిజన్ కార్యదర్శి సీ వై పుల్లయ్య పాల్గొని, మద్దతు తెలుపీ , ప్రసంగిస్తూ, నెలకొండపల్లి మండల కేంద్రం పాత బస్టాండ్ చెరువు కట్ట దగ్గర రోడ్డు విస్తరణలో 50 అడుగుల లో 43 అడుగులు రోడ్డు విస్తరిస్తే పేదల ఇండ్లు 10 వరకు ఆగుతాయని, లేనియెడల పేదలు అన్యాయం అవుతారని, 43 అడుగుల రోడ్డు సరిపోతుందని అన్నారు.
also read :-రైతును రాజు చేసి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా నిలిపింది కేసీఅర్.. మంత్రి పువ్వాడ.
బైపాస్ రోడ్డు కూడా వేస్తున్నారని, వాహనాల రాకపోకలు కూడా తగ్గుతాయని, కూడా తగ్గుతుందని, కనక 43 అడుగుల రోడ్డు సరిపోతుందని ఆయన అన్నారు. మా ఇండ్లను కూల్చవద్దని గత 15 రోజులుగా నిరుపేదలైన వారు ధర్నాలు, దీక్షలు,ప్రదర్శనలు నిర్వహిస్తున్న అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని, వారి సమస్యలు పరిష్కరించడం లేదని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్అండ్బీ అధికారులు ఇండ్లను కూల్చి రోడ్డు వేయటం ప్రధానంగా భావిస్తున్నారని, ఇల్లులు పోయి పేదలు అనాధలుగా మిగులుతారని, తీవ్ర ఇబ్బందులకు గురవుతారని, కనుక ఇళ్లను కూల్చే ప్రయత్నాలను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
పడమర చెరువు కట్ట వైపు 7 అడుగుల రోడ్డు ని పెంచడానికి అవకాశం ఉందని, కానీ ఎన్ఎస్పీ అధికారులు వ్యతిరేకించడం సరైంది కాదని, కట్ట వైపు ఏడడుగుల రోడ్డుకు అనుమతించాలని ఆయన కోరారు.కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం 50అడుగుల రోడ్డు వేసిస్తున్నారని, ఫలితంగా పేదల ఇండ్లు కులుస్తున్నారని, వారు దిక్కులేని వారవుతున్నారని ఆయన అన్నారు.బాధితులు గూడెల్లి రాంబాబు, శ్రీను,రాజు, గూడెల్లి పెద్ద వెంకన్న,కవిత, కుమారి, పెద్దలక్ష్మి, సుజాత,రమణయ్య తదితరులు పాల్గొన్నారు.