ఖమ్మం నగరంలో ఎంపీ నామ సుడిగాలి పర్యటన
== పలు కుటుంబాలకు పరామర్శ
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శుక్రవారం సాయంత్రం ఖమ్మం నగరంలో విస్తృతంగా పర్యటించారు. తన పర్యటన లో భాగంగా ముందుగా ఖమ్మం నగరంలో ఇటీవల నూతనంగా ప్రారంభమైన కావ్య హాస్పిటల్ కు వెళ్ళారు. హాస్పిటల్ స్థాపించిన డా.యాలముడి కావ్య, డాక్టర్లకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతరం ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను ఆయన పరామర్శించారు.
also read;-ధర్మతండాలో వైభవంగా శ్రీ గోపయ్య,లక్ష్మితిరుపతమ్మ కల్యాణం
45వ డివిజన్ లో కౌటూరి దుర్గా ప్రసాద్ మాతృమూర్తి ఇటీవల మరణించగా కుటుంబ సభ్యులను, ఇటీవల మరణించిన గుర్రం ప్రసాద్ రావు కుటుంబ సభ్యులను, మాజీ కార్పొరేటర్ నాగండ్ల దీపక్ చౌదరి తండ్రి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను, 54వ డివిజన్ లో కమ్మ సంఘం రాష్ట్ర కార్యదర్శి సిరిపురపు సంపత్ మాతృమూర్తి ఇటీవల మరణించగా కుటుంబ సభ్యులను, 6వ డివిజన్ లో నామ వెంకన్న మాతృమూర్తి మరణించగా వారి కుటుంబ సభ్యులను 31వ డివిజన్ లో నాగండ్ల శ్రీను తండ్రి ఇటీవల మరణించగా కుటుంబ సభ్యులను ఎంపీ నామ నాగేశ్వరరావు పరామర్శించారు.
also read;-హోలీ సంబరాలకు కేరాఫ్ ’లోక్యతండా‘
ఈ కార్యక్రమాల్లో ఆయన వెంట రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, కార్పొరేటర్లు బుడిగం శ్రీను, నాగండ్ల కోటేశ్వరరావు, ఎర్ర గోపి, గజ్జెల వెంకన్న నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, గొడ్డేటి మాధవరావు, నరేందర్, కర్నాటి సీతారాములు, తాళ్లూరి శ్రీనివాస్, అంబటి కృష్ణయ్య, పంతంగి వెంకటేశ్వరరావు, రమణ, జానీకి రామయ్య, ఉప్పునూతల నాగేశ్వరరావు, నామ సేవా సమితి సభ్యులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.