Telugu News

నిర్భయంగా ,స్వేచ్ఛగా ఓటు వేయలేని దుస్థితి టిఆర్ఎస్ పాలనలో…

* మీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మీద నమ్మకం లేదా ..?

0

నిర్భయంగా ,స్వేచ్ఛగా ఓటు వేయలేని దుస్థితి టిఆర్ఎస్ పాలనలో…

* మీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మీద నమ్మకం లేదా ..?

* పాలనను గాలికి వదిలేసి క్యాంపు రాజకీయాలు సిగ్గుచేటు ..

* రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా ఉన్న భాను ప్రసాద్ ఏం అభివృద్ధి చేశారు..?

మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్…

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ ఆశయాలు, నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితిని తీసుకు వచ్చిందని, కేవలం అధికార కాంక్షతో టిఆర్ఎస్ పరిపాలన కొనసాగిస్తుందని మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ విమర్శించారు.

శుక్రవారం కరీంనగర్లో ఆయన బిజెపి కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్ , మేయర్ సునీల్ రావులకు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ, పరిపాలన మీద లేదన్నారు. హుజురాబాద్ ఎన్నికలు మొదలుకొని నేడు జరగబోతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం పాలనను గాలికి వదిలేసి, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ , ఎన్నికలే పరమావధిగా భావించడం సిగ్గు చేటన్నారు . టిఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు , ఉద్యోగులు ,నిరుద్యోగు లు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ,ఏ ఒక్కరు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనతో సంతోషంగా లేరని తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుతం జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పడరాని పాట్లు పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు , కార్పొరేటర్లు , మున్సిపల్ కౌన్సిలర్ల పై నమ్మకం లేక క్యాంపులకు తరలించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇన్నాళ్లు ఆయా ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ ప్రభుత్వానికి గుర్తుకు రాలేదని, వారికి ఏలాంటి నిధులు, విధులు లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ఆయన దుయ్యబట్టారు. నేడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం టిఆర్ఎస్ అధికార కాంక్షతో వారందరిపై కపట ప్రేమ చూపుతోందని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల నుండి రెండు పర్యాయాలు ఎమ్మెల్సీ గాగెలుపొందిన భాను ప్రసాద్ రావు ఏం అభివృద్ధి చేశారో స్పష్టం చేయాలన్నారు.

ఎమ్మెల్సీ భానుప్రసాద్ కు కనీసం తన పరిధిలో ఉండే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పేర్లు , వివరాలు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. భాను ప్రసాద్ రావు ఎమ్మెల్సీ హోదాలో ఏ నాడు కరీంనగర్ కు వచ్చింది లేదని , ఏ లాంటి అభివృద్ధి పనులు కూడా చేపట్టిన పాపాన పోలేదని ,ఒక్క స్థానిక సంస్థల ప్రజాప్రతినిధికి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు . జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ అంతరాత్మను ప్రశ్నించుకొని, ఆత్మాభిమానాన్ని చంపు కోకుండా ధర్మానికి ఓటు వేయాలని ,ఎమ్మెల్సీ ఎన్నికలు ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పారు.హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అడ్డ దారులకు పాల్పడిన, విచ్చలవిడి డబ్బు మద్యం పంపిణీ చేసిన, వోటర్లను ప్రలోభాలకు గురి చేసిన టిఆర్ఎస్ కు ఓటమి ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటి తీర్పు అన్నారు . తెలంగాణలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరించిందని , అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు.

అలాగే కరీంనగర్ మంత్రి గంగుల కమలాకర్,మేయర్ సునీల్ రావు కరీంనగర్ నగర పాలక సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని, పట్టణంలో అభివృద్ధిని అస్తవ్యస్తంగా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెండేళ్లలో ఇద్దరు కమిషనర్లు ఇక్కడ నిలదొక్కుకోలేకపోవడం మంత్రి, మేయర్ పనితనానికి నిదర్శనం అన్నారు. మంత్రి, మేయర్ తమ పద్ధతులు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.ఇట్టి సమావేశంలో బిజెపి కార్పొరేటర్లు కోలగాని శ్రీనివాస్, దురిశెట్టి అనూప్,
కచ్చురవి, మర్రి సతీష్, బండ రమణారెడ్డి, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ రాముల శ్రీకాంత్, ఈస్ట్ జోన్ ఉపాధ్యక్షులు తోట సాగర్, మైనార్టీ మోర్చా అధికార ప్రతినిధి ఆసద్ , నాయకులు ఎలగందుల అరుణ్ తదితరులు పాల్గొన్నారు .

also read :- మాస్క్, వ్యాక్సిన్ పై తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు