Telugu News

వైసిపికి బిగ్ షాక్.. టీడీపీలోకి ఫైర్ బ్రాండ్..! కారణం అదేనా.?

అమరావతి విజయం న్యూస్

0

వైసిపికి బిగ్ షాక్.. టీడీపీలోకి ఫైర్ బ్రాండ్..! కారణం అదేనా.?

(అమరావతి విజయం న్యూస్):-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలో అసమ్మతి నేతలపై అవతల పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీలో కేబినెట్ విస్తరణ వ్యవహారంతో అసమ్మతి రాగం పెరిగింది. ఇదే సమమంలో వర్గ పోరుతో కొన్ని జిల్లాల్లో కీలక నేతలు సైతం అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారు. రోజుకో నేత మనసులో ఆవేదనను బయట పెడుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో మారో వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియా స్టార్‌, వైఎస్ఆర్ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్‌, ఏపీ శ్యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి (Byreddy Sidharth Reddy) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) గూటికి చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ఆయన.. ఏపీ సీఎం జగన్ (CM Jagan) కు హార్డ్ కోర్ అనుచరునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ఆయన ఇంత సడెన్ గా పార్టీ మారడం ఏంటని అంతా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వాస్తవం ఏంటి..

also read :-సారు ……మమ్మల్ని విధుల్లో కి తీసుకోండి

తొలి నుంచి తెలుగుదేశం పార్టీ అండ బైరెడ్డి కుటుంబానికి ఉంటూనే ఉంది. మూడుసార్లు బైరెడ్డి శేషశయనారెడ్డి ఎమ్మెల్యేగా ఆ పార్టీ నుంచి గెలుపొందారు. కర్నూలు జిల్లా నందికొంట్కూర్ కేంద్రంగా బైరెడ్డి కుటుంబం కొన్ని దశాబ్దాలుగా రాజకీయాన్ని నడుపుతోంది. ఆయన వారసునిగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలుపొందడమే కాకుండా మంత్రిగా కూడా పనిచేశారు. ఆ కుటుంబం తొలి నుంచి టీడీపీతోనే ఉండేది. ఆ తరువాత జరిగిన పరిణామాల క్రమంలో 2012న రాజశేఖర్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని చేపట్టారు. ఆయన సోదరుని కుమారుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి యువనాయకునిగా కాలేజి నుంచి ఎదిగారు. తెలుగుదేశం పార్టీకి 2018 వరకు సిద్ధార్థరెడ్డి పరోక్షంగా సేవలు అందించారు. బాబాయ్ రాజశేఖర్ రెడ్డికి అనుగుణంగా నడుస్తూ వచ్చారు.

also rea d:-ఇకపై సలేశ్వర క్షేత్రానికి రావద్దు
కానీ 2019 ఎన్నికలకు ముందు.. కుటుంబంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో వైఎస్ ఆర్ పార్టీలో సిద్ధార్థరెడ్డి చేరారు. నందికొట్కూర్ నియోజకవర్గం ఇంచార్జిగా కూడా పనిచేశారు. పార్టీని బలోపేతం ఎన్నికల నాటికి బలోపేతం చేశారు. తనకు కచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తారని ఆశించారు. కానీ సామాజిక ఈక్వేషన్లు, స్థానికంగా ఉండే రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయనకు జగన్ టిక్కెట్ ఇవ్వలేకపోయారు. ఆర్థర్ కు వైసీపీ టిక్కెట్ దక్కింది. అయితే అధినేత జగన్ పై నమ్మకంతో.. ఆర్ధర్ ను గెలిపించే బాధ్యతలను సిద్ధార్థరెడ్డి తీసుకున్నారు.. గెలిపించారు కూడా.. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆర్థర్, సిద్ధార్థ రెడ్డి మధ్య అంతర్గత పోరు పెరిగింది. ఒకానొక సమయంలో నేరుగా జగన్ జోక్యం చేసుకుని ఇద్దరి మధ్యా పంచాయతీ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం సిద్ధార్థరెడ్డికి క్యాబినెట్ ర్యాంకు ఉన్నశాప్ చైర్మన్ పదవిని జగన్ ఇచ్చారు.

also read :-అసైన్డ్ భూములు గుంజుకుంటే ఆందోళన తప్పదు
ఇదీ చదవండి : ఈ ఎస్ఐ రియల్ గబ్బర్ సింగ్.. పోలీస్ వాహనం వదిలి.. గుర్రంపై స్టేషన్ కు.. కారణం అదేనా?
యువ లీడర్ గా సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న సిద్ధార్థరెడ్డికి హోదా పెరగడంతో నియోజకవర్గంలో తిరుగులేకుండా పోయింది. ఒక వైపు సోషల్ మీడియా క్రేజ్ తో పాటు వివిధ రకాల ప్రారంభోత్సవాలకు చురుగ్గా హాజరువుతున్నారు. సిద్ధార్థరెడ్డి క్రేజ్ ను గమనించిన వైసీపీ అధిష్టానం ఆయనపై నిఘా పెట్టింది. ఆయనకు వ్యతిరేకంగా ఉండే గ్రూప్ ను ఇటీవల ప్రోత్సహించడం ప్రారంభించింది.
ఆ విషయాన్ని సిద్దార్థరెడ్డి వర్గం క్లోజ్ గా గమనించిందని టాక్‌. అందుకే, ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధార్థరెడ్డి అన్వేషిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, చంద్రబాబు నేరుగా సిద్దార్థ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడని తెలుస్తోంది.

ఆ తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, సిద్ధార్థ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారని నందికొట్కూర్ కేంద్రంగా న్యూస్‌ గుప్పుమంటోంది. నందికొట్కూర్, శ్రీశైలం తో పాటు కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలపై పెత్తనం ఇవ్వడానికి టీడీపీ అంగీకరించిందని టాక్‌. అందుకే, త్వరలో సిద్ధార్థరెడ్డి టీడీపీ గూటికి చేరతారని బలమైన ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం జగన్ కు వీరవిధేయునిగా ఉన్న సిద్ధార్థరెడ్డి పార్టీ మారే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కానీ, రాజకీయంగా ఎదగాలనే ఆలోచన ఉన్న సిద్ధార్థ రెడ్డికి వైసీపీలోని గ్రూప్ విభేదాలు అడ్డుగా ఉన్నాయి. అందుకే నాలుగు నెలల నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా లేరు. ఇలాంటి పరిణామాలన్నీ చూస్తే ఆయన టీడీపీలోకి వెళతారనే ప్రచారానికి మద్ధతుగా ఉన్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చనే నానుడి ప్రకారం సిద్ధార్థరెడ్డి టీడీపీలోకి మారినప్పటికీ ఆశ్చర్యం లేదని చెప్పుకోవచ్చు.