Telugu News

వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ దే.

 ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

0

వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ దే.
 ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
 అభినందనలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎంపీ కవిత
(వరంగల్-విజయంన్యూస్)

ఉమ్మడి వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని అధికారికంగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ శ్రేణులు ఆనందం వెల్లివిరిసింది. తెలంగాణ రాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి,ఎంపీ కవిత తో కలిసి ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ని శాలువా తో ఘనంగా సత్కరించారు.

నూతనంగా రెండవ సారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి, ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ములుగు నియోజకవర్గం అన్ని మండలాల్లో ఎంపీటీసీలకు,గులాబి శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. గులాబీ శ్రేణులు అమరవీరుల స్థూపం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు.

also read :-కరీంనగర్ జిల్లా, మానుకొండురూలో ఘోర రోడ్డు ప్రమాదం..