Telugu News

వరంగల్ హోల్ సేల్ వ్యాపారస్తులకు అండగా ఉంటాం.: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

వరంగల్ ప్రతీనిది విజయం

0

***వరంగల్ హోల్ సేల్ వ్యాపారస్తులకు అండగా ఉంటాం.: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
***(వరంగల్ ప్రతీనిది విజయం);-
వరంగల్ హోల్ సేల్ ట్రేడర్స్ కమర్షియల్ వ్యాపారస్తులకు అన్నివిధాల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్రపంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం గ్రేటర్వరంగల్ సిటీలోని 16వ డివిజన్ పరిధిలోని ధర్మారం వద్ద కొత్తగా నిర్మించిన వరంగల్హోల్ సేల్ కమర్షియల్ అపరేషన్స్ ఆఫ్ కాంప్లెక్స్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్,గండ్ర వెంకటరమణ రెడ్డి, ఎంపీ దయాకర్, గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, మాజీమంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ చేతుల మీదుగ వైభవంగాప్రారంభోత్సవం చేశారు.

also read :-రాజేంద్రనగర్ మానస హిల్స్ పై సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది.

ముందుగా కాంప్లెక్స్ఆవరణంలో ఏర్పాటు చేసిన దేవాలయంలో ప్రత్యేక పూజలను మంత్రి, ఎమ్మెల్యేలు,వ్యాపారసులు నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి దయాకర్‌రావుమాట్లాడుతూ.. మన వరంగల్ జిల్లా మీద సీఎం కేసీఆర్‌కుప్రేమ ఎక్కవగా ఉంటుందని ఆయన చెప్పారు. వ్యాపారస్తులు సొంతగా నిర్మించుకున్న హోల్సేల్ వ్యాపారస్తుల కాంప్లెక్స్ కు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహాకారులులేకుండానే.. ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం మీకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. వరంగల్ హోల్ సేల్ వ్యాపారస్తులు ఆర్థికంగాఎదుగాలని, స్థానికంగా ఉండే వారికి, కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయనకోరారు.

also read :-***కలెక్టర్ సారూ.. మా భూమి పై మాకు హక్కు కల్పించండి

సీఎం కేసీఆర్ తో పాటు ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో వరంగల్ జిల్లాను అభివృద్ధిచేసుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంపరిధిలోని ధర్మారం వద్ద కొత్తగా నిర్మించి వరంగల్ హోల్ సేల్ వ్యాపారస్తులకు ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తానని ధర్మారెడ్డిఅన్నారు.ఈకార్యక్రమంలోకార్పొరేటర్లలు,చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిండెంట్ బొమ్మినేని రవీందర్ రెడ్డి, సిహెచ్.వీరారావు, హోల్ సేల్వ్యాపారస్తులు తోట జగన్మాధం, తోట శివకుమార్, రాజేశ్ కరాణి, వి.విశేషం.రవికుమార్, వెంకటేశ్వర్ రావు, సురేష్, ప్రజాప్రతినిధులు, వరంగల్ హోల్ సేల్ ఆల్మెంబర్లలతో పాటు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.