Telugu News

ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి ఉద్యగం లోకి తీసుకొంటాము

అశ్వారావుపేట విజయం న్యూస్

0

ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి ఉద్యగం లోకి తీసుకొంటాము

(అశ్వారావుపేట విజయం న్యూస్):-

రాష్ట్రంలోని ఏడువేల మందికి పైగా ఉన్నటువంటి ఉపాది హమి ఫీల్డ్ అసిస్టెంట్ లకు కొద్ది సేపటి క్రితం ప్రభుత్వం శుభవార్త చెప్పింది.తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి ఉద్యోగం లోకి తీసుకొంటామని అసెంబ్లీసాక్షి గా ముఖ్యమంత్రి ప్రకటించారు.మరల ఆ తప్పు చేయవద్దని అన్నారు.ఈ నేపథ్య వెనుక గల కధనం ఇలా ఉంది.

also read;-క్రిష్‌`4 సినిమా సీక్వెల్‌పై నెట్టింట్‌ హాల్ చల్
మహత్మగాంధి ఉపాది హమి పదకం లొ ఫీల్డ్ అసిస్టెంట్ ది కీలకమైన పాత్ర,సంఘాలు చేయటం,పనులు చేయించడం,మస్తరులు ఇత్యాది పనులు చేస్తుంటారు. వీరికి పదివేల రుపాయల వేతనం ఇస్తారు.టార్గెట్ లు పెట్టటం అవి చేరుకోక పోతే వేతనం కోతపెట్టటం ఇలాంటి టార్చర్ పెట్టటం జరిగింది.దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ లు ఎదురు తిరిగి తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేసారు.విధుల్లో కి చేరమని ప్రభుత్వం వీరిని హెచ్చరిస్తు..గడువు ఇచ్చింది.అయినప్పటికీ ఫీల్డ్ అసిస్టెంటు లు వెరవక సమ్మె ను కొనసాగించారు.దీంతో ప్రభుత్వం ఒక్క కలం పోటుతొ 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల నోట్లో మట్టి కొట్టింది,తొలగించింది.అప్పటి నుండి తమను
విధుల్లోకి తీసుకోవాలని పోరాటం చేస్తున్నారు.కొంతమంది న్యాయస్థానం మెట్లు ఎక్కగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది.అయినప్పటికీ ప్రభుత్వం లక్ష్యపెట్టలేదు.

also read;-బాహుబలి`3 కోసం కసరత్తులు

అసెంబ్లీ సమావేశాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లకు న్యాయం చేయాలని సి.ఐ.టి.యు అధ్వర్యంలో పెద్ద ఎత్తున పలు జిల్లాలో ఉద్యమం మొదలు పెట్టారురెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించిన ఫీల్డ్ అనిసెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ తో వీరు పోరాటం చేస్తున్నారు. ఈ రోజు వీరి సమస్య పై అసంబ్లీ సాక్షి గా ప్రభుత్వం ప్రకటన చేసింది.మంచి జరుగుతుందని ఆశిద్దాం .