Telugu News

గిరిజనులకు జరుగుతున్న అవమానాలను ఖండిస్తున్నాం

గిరిజనులంత ఐక్యంగా ముందుకు వెళ్దాం

0

గిరిజనులకు జరుగుతున్న అవమానాలను ఖండిస్తున్నాం

** గిరిజనులంత ఐక్యంగా ముందుకు వెళ్దాం

** 13 న మండల కేంద్రంలో గిరిజనుల ఐక్య సదస్సు 

** విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటి చైర్మన్ సెట్రామ్ నాయక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు జర్పుల శ్రీనివాస్

(విజయం న్యూస్ కూసుమంచి):-

కూసుమంచి ఏప్రిల్ 09:  కూసుమంచి మండలంలో పలు దఫాలుగా గిరిజనులకు అవమానాలు జరుగుతున్నాయని, ప్రజాప్రతినిధులు, మండల మొదట పౌరులను అవమానిస్తున్నారని, దీనిని కూసుమంచి మండల గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తున్నామని నేలకొండపల్లి మార్కెట్ కమిటి చైర్మెన్ సెట్రామ్ నాయక్, గిరిజన శక్తి జిల్లా అధ్యక్షుడు జర్పుల శ్రీనివాస్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని శనివారం ఎస్ ఆర్ ఫంక్షన్ హల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు.

also read :-పేదవారి భూములు లాక్కుంటే యుద్ధమే

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులందరు అంత ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తద్వారా మన హక్కులు కాపాడుకోవచ్చని తెలిపారు. బంజారుల కులస్థులందరు ఐక్యంగా ఉండాలనే ఆలోచనతో  ఈ నెల 13 న బారీ ఎత్తున కూసుమంచి మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హల్లో కూసుమంచి మండల గిరిజన ఐక్య సదస్సు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సదస్సుకు మండలంలోని బంజర ప్రజాప్రతినిధులు, బంజార నాయకులు‌, కులస్తులులందరు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ  కార్యక్రమంలో సర్పంచులు బానోత్ నాగేశ్వరరావు, దారావత్ వెంకట్ నాయక్,  బర్మవాత్ రవి, మూడు కోటు నాయక్, బానోత్ శ్రీనివాస్ నాయక్ , ఎంపిటిసి మంగ్య నాయక్, నాయకులు బానోత్ సత్యం నాయక్, జ ర్పుల బిక్షం నాయక్,బాధవాత్ రవి నాయక్, భూక్యా వెంకన్న నాయక్, శ్రీనివాసు నాయక్ , బానోత్ ఉపేందర్, పూల్ సింగ్, తదితరులుపాల్గొన్నారు.