Telugu News

సభ్యత్వ నమోదు తో మన సత్తా తేల్చాలి

= ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ శివకుమార్

0

సభ్యత్వ నమోదు తో మన సత్తా తేల్చాలి
== ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ శివకుమార్

(ఖమ్మం ప్రతినిధి – విజయంన్యూస్)
సభ్యత్వ నమోదు తో మన సత్తా తేల్చాలని, అందుకు గాను ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముందుండి నడిపించాలని, అత్యధిక సభ్యత్వాలు ఖమ్మం జిల్లాలోనే ఉండాలని ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్, కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యదర్శి శివకుమార్ పిలుపునిచ్చారు. గురువారం అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలోని సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శివ కుమార్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ మాట్లాడారు.

భారత దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవటం అదృష్టమని ఈసారి సభ్యత్వం డిజిటల్ ఆన్లైన్ రూపేణ కల్పించారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ప్రతి డివిజన్ కి లింక్ పంపించడం జరుగుతుంది. ఆ డివిజన్ లో ఉన్నటువంటి బూతు అధ్యక్షులు బూత్ ఎం రోలర్ గా డివిజన్ అధ్యక్షులు నిర్మిస్తారని ప్రతి బూత్ అధ్యక్షుడు వంద మందినీ సభ్యత్వ నమోదు చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని ప్రతి ఆరు డివిజన్ల కి ఒక ఇంచార్జ్ ను నియమిస్తూ పది మందిని పూర్తిగా ఇన్చార్జిలు గా నియమిస్తామని ఈ నెల ఆఖరి వరకు ఖమ్మం నియోజకవర్గంలోని అన్ని బూతులు సభ్యత్వ నమోదు చేపట్టాలని సూచించారు సభ్యత్వ నమోదు చేయించుకున్న టువంటి ప్రతి సభ్యునికి ఇన్సూరెన్స్ చెందేటట్లు గా ఈసారి సభ్యత్వం ఏర్పాటు చేయనుందని కావున ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన ప్రమాదం జరిగి అంగవైకల్యం చెందిన ప్రమాద భీమా వర్తిస్తుందని ఇందుకుగాను కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు లక్షల రూపాయలు చెల్లిస్తుందనీ చెప్పారున.

also read :- నేడు ఖమ్మం జిల్లాకు హారీష్ రావురాకా

ఈ పత్రికా సమావేశంలో ఖమ్మం అసెంబ్లీ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ మడుపల్లి భాస్కర్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, ఏలూరు రవి కుమార్, కొప్పెర ఉపేందర్, శంకర్ నాయక్, మద్ది వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.