Telugu News

ప్రతి దళిత కుటుంబానికి ‘దళితబంధు’ ఇస్తాం : మంత్రి పువ్వాడ

= అపోహాలు, అసత్య ప్రచారాలు నమ్మోద్దు

0

ప్రతి దళిత కుటుంబానికి ‘దళితబంధు’ ఇస్తాం : మంత్రి పువ్వాడ
== అపోహాలు, అసత్య ప్రచారాలు నమ్మోద్దు
== ఒకే రకమైన యూనిట్లు కాకుండా దళితులు స్థిరపడే విధంగా యోచన చేయండి
== లబ్దిదారులను చైతన్యపరిచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు క్రుషి చేయాలి
== జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
== జిల్లా పరిషత్ కార్యాలయంలో చింతకాని మండల ప్రజాప్రతినిధులు, అధికారుల సమీక్ష సమావేశం
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అందుతుందని, ఇట్టి విషయంలో ఎటువంటి అపోహలు అవసరం లేదని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేసారు. దళితబంధు పథకం క్రింద పయిలెట్ ప్రాజెక్టుగా ఎంపిక అయిన చింతకాని మండలం స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రత్యేక అధికారులు, శాసనమండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా కలెక్టర్ తో కలిసి శనివారం సాయంత్రం డి.పి.ఆర్.సి సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సులో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించి ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలను స్వీకరించి దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ పై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేసారు.

also read;-దళిత బందు పేరిట డబ్బులు వసూలు చేస్తే తాటతీస్తా: భట్టి

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు పథకానికి ఎంపిక అయిన నాలుగు మండలాల్లో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలాన్ని గౌరవ ముఖ్యమంత్రివర్యులు పయిలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసారని మూడు మండలాలతో పోలిస్తే చింతకాని మండలంలోనే లబ్దిదారుల సంఖ్య ఎక్కువగా ఉందని శ్యాచురేషన్ మోడ్లో మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు అంధిస్తామన్నారు. లబ్ధిదారులు ఒకే రకమైన యూనిట్ల స్థాపనకు మొగ్గు చూపకుండా డిమాండ్ కలిగిన యూనిట్లను స్థాపించుకునే విధంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధిదారులను మరింత చైతన్య పర్చాలన్నారు. దళితబంధు లబ్దిదారుడు స్థిరపడే వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు తల్లి దండ్రుల బాధ్యత పోషించాలని గౌరవ ముఖ్యమంత్రివర్యుల లక్ష్యం నెరవేరే వరకు పనిచేయాలని మంత్రి అన్నారు.

also read;-యాదవులు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం : కందాళ

ఒక్క చింతకాని మండలంలోనే సుమారు 450 కోట్లు దళితబంధు ద్వారా లబ్ధి చేకూర్చనున్నట్లు మంత్రి తెలిపారు. దళితవాడలు బంగారు మేడలు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, లబ్దిదారుని ఆసక్తికనుగుణంగా యూనిట్ల స్థాపనకు ప్రోత్సహించాలని ఒకే రకమైన యూనిట్లు కాకుండా వినూత్న ఆలోచనలతో యూనిట్లు స్థాపించే విధంగా అవగాహన కల్పించాలని మంత్రి అన్నారు. చింతకాని మండలం ఖమ్మం నగరానికి సమీపంలో ఉందని, మండలం, గ్రామం పరిధిలోనే కాకుండా లబ్దిదారులు తనకు అనుభవం ఉన్న రంగాలలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా యూనిట్లు స్థాపించు కోవచ్చని పది లక్షలతో ఒక్కటి లేదా రెండు యూనిట్లు అదేవిధంగా ఇద్దరు ముగ్గురు కలిసి పెద్ద యూనిట్ స్థాపించుకోవచ్చని మంత్రి తెలిపారు.

also read ;-గంగబండతండాకు నీళ్లు ఇప్పించాలని తుమ్మలకు రైతుల వినతి

డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి నిర్మాణ రంగం, హార్వేస్టర్లు, ఫోటో/ వీడియోగ్రఫీ, ఫిట్నెస్ సెంటర్లు, పాల ఉత్పత్తులు, ల్యాబ్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్ల వంటి వినూత్న రంగాలలో వృత్తికి సంబంధించి నిష్నాతులైన వారిని ఆయా వృత్తులలో ప్రోత్సహించి మొదటి ప్రాదాన్యతగా యూనిట్ల గ్రౌండింగ్ కు సిద్ధం చేయాలని మంత్రి అన్నారు. ట్రాన్స్పర్టు రంగంలో దాదాపు 45 శాతం యూనిట్ల స్థాపనకు మొగ్గు చూపుతున్నారని అందరు ఒకే రకమైన యూనిట్లు నెలకొల్పడం ద్వారా భవిష్యత్తులో డిమాండ్ తగ్గి నష్టపోయో ప్రమాదం ఉంటుందని ట్రాన్స్పర్ట్ సెక్టారుని తగ్గించి ప్రాధాన్యత సెక్టార్లలో యూనిట్ల స్థాపనకు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు మంత్రి సూచించారు.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు దళితబంధుకు శ్యాచురేషన్ మోడ్లో ఎంపిక చేసిన చింతకాని మండలంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రత్యేక అధికారుల సహకారంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యూనిట్ల స్థాపన పట్ల లబ్ధిదారులను చైతన్యపర్చి వారిలో విశ్వాసం కల్పించడం జరిగిందని ఇప్పటికే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యుల ఆదేశాల మేరకు మండలంలోని ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరణకు గాను అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రివర్యుల విలువైన సూచనలను పరిగణలోకి తీసుకొని చింతకాని మండలంలో దళితబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తామని ఈ పథకం క్రింద ఇప్పటికే ప్రభుత్వం మండలానికి వంద కోట్లు విడుదల చేసిందని, అనుభవం, నైపుణ్యత, ఆలోచనలతో సిద్ధంగా ఉన్న లబ్దిదారులకు మొదటి ప్రాధాన్యత కల్పించి యూనిట్ల గ్రౌండింగ్ కు సత్వర చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. యూనిట్ల స్థాపనకు గాను వివిధ సెక్టార్లకు సంబంధించిన సెక్టార్ గ్రౌండింగ్ కమిటీ అధికారుల ఆధ్వర్యంలో సెక్టార్ల వారీగా లబ్దిదారులకు వృత్తినైపుణ్యత శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి వచ్చే వారం నుండి యూనిట్ల గ్రేడింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామని కలెక్టర్ అన్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆలోచనలను అమలు చేస్తున్న దళితబంధు మైలురాయిగా నిలువబోతుందని దళితుల స్థితిగతులను మార్చేందుకు కుటుంబానికి 10 లక్షలు పెట్టుబడి సాయంగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రివర్యులు వినూత్న ఆలోచన చేసి దళితబంధుకు శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. ఖమ్మం నగరానికి సమీపంలో గల చింతకాని మండలంలో సెంట్రింగ్ మెటీరియల్, మిక్సర్స్ యూనిట్, డైరీ యూనిట్లకు అధిక డిమాండ్ ఉందని గ్రామసర్పంచు, ఎం.పి.టి.సిలు, జడ్పీ.టి.సిలు, ఎం.పి.పిలు అధికారుల సమన్వయంతో లబ్దిదారులకు అవగాహన కల్పించి లాభసాటి యూనిట్ల స్థాపనకు ప్రోత్సహించాలని ఆయన తెలిపారు.

శాసనమండలి సభ్యులు తాతా మధుసూధన్ మాట్లాడుతూ ఎంతో మేధోమధనం జరిగిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రివర్యులు సుదీర్ఘ ఆలోచన చేసి దళితసాధికారతకు, తెలంగాణ సమాజం సంస్కరణలకు దళితబంధుకు శ్రీకారం చుట్టారని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రత్యేక అధికారులు దళితబంధు యూనిట్ల స్థాపనకు గ్రౌండ్ లెవల్లో సమగ్ర ప్రణాళికతో లబ్ధిదారులను సిద్ధం చేయాలన్నారు. దళిత వర్గాల ఆర్ధిక అభివృద్ధికై అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చింతకాని జడ్పీ.టి.సి కిషోర్, ఎం.పి.పి పూర్ణయ్య, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్స్ సురభి, శిక్షణ కలెక్టర్ బి.రాహుల్, ఎస్సీ కార్పోరేషన్ ఈ.డి కె.సత్యనారాయణ, చింతకాని మండలం జడ్పీ.టి.సిలు, ఎం.పి.టి.సిలు, సర్పంచ్లు, ఎం.పి.పిలు, గ్రామ ప్రత్యేక అధికారులు సెక్టార్ గ్రౌండింగ్ కమిటీ అధికారులు అవగాహన సదస్సులో పాల్గొన్నారు.