Telugu News

టీఆర్ఎస్ ను భూస్తాపితం చేస్తాం

సాయిగణేష్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే

0

టీఆర్ఎస్ ను భూస్తాపితం చేస్తాం
== సాయిగణేష్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే
== ప్రభుత్వమే బాధ్యత వహించాలి
== అక్రమ కేసులతో బీజేపీ కార్యకర్తలను భయపెట్టలేరు.
== ఎవర్ని వదిలేది లేదు
== సచివాలయం లేని రాష్ర్టం తెలంగాణ ఒక్కటే
== అభివృద్దిపై చర్చకు సిద్దమా..?
== మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరిన కిషన్ రెడ్డి
== తుమ్మల హయంలోనే ఖమ్మం అబివృద్ది జరిగింది
== తెలంగాణలో బీజేపీ గెలవబోతుంది
== రౌడీ పరిపాలనకు అంతం తప్పదు
== ప్రభుత్వం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ద్వజం
== మంత్రిని వదిలిపెట్టం.. న్యాయపోరాటం చేస్తాం: బండి సంజయ్
== తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తోంది : జేపీ నడ్డా
== సాయిగణేష్ సంతాపసభలో ఆయన కుటుంబానికి రూ.8లక్షల చెక్కును పింణి చేసిన మంత్రి కిషన్ రెడ్డి
== సభకు భారీగా తరలివచ్చిన జనం
== సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు
== కుటుంబానికి అండగా ఉంటామని హామి
(ఖమ్మం-విజయం న్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సాయిగణేష్ ది కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని, ఈ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్రమంత్రి డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్ సమీపంలో సంతాప సభను ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ముందుగా ఖమ్మం చేరుకున్న మంత్రి కిషన్ రెడ్డికి జిల్లా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న సాయిగణేష్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించారు. గణేష్ అమ్మమ్మ సావిత్రమ్మతో మాట్లాడారు. జరిగిన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చాలా బాధపడ్డారు. కుటుంబానికి అండగా ఉంటామని హామినిచ్చారు.

also read :-హైదారాబాద్ – వరంగల్ రహదారిలో బీబీ నగర్ – టోల్ గేట్ మధ్య రోడ్డు ప్రమాదం

పార్టీ, కేంద్రప్రభుత్వం తప్పకుండా మీకు అండగా ఉంటామని హామినిచ్చారు. బీజేపీ పార్టీ రూ.8లక్షల సహాయన్ని అందించిందని, అందుకు గాను చెక్కులను అందజేస్తున్నట్లు సావిత్రమ్మకు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాచౌక్ లో జరిగిన సంతాపసభలో ముఖ్యఅతిథిగా హాజరై అక్కడ సాయిగణేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానూభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపరిపాలన కొనసాడం లేదని, కుటుంబ పాలన, నిరంకుశ పాలన, అవినీతి పాలన, అక్రమాల పాలన నడుస్తోందని ఆరోపించారు. నీళ్ళు, నిధులు, నియామకాల లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు కేసీఆర్ పోలాలకు, నిధులు కేసీఆర్ కుటుంబానికి, నియామకాలు కేసీఆర్ కుటుంబానికి పారుతున్నాయని విమర్శించారు. 1200 మంది తెలంగాణ అమరవీరులు త్యాగం చేసింది ఇందుకోసమేనా..? అనిప్రశ్నించారు. నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఏ ఒక్క ఉద్యమకారుడైనా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా..? అని ప్రశ్నంచారు.

also read :-దేశంలో ఒడివడిగా పెరుగుతున్న కరోనా కేసులు

అందరు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కుట్రపన్నినవారు, తెలంగాణవాధులపై దాడులు చేసిన వారు, అక్రమ కేసులు పెట్టిన వారు రాజ్యమెలుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించమని అడిగితే స్వయంపరిపాలనను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు పాలించే చేతగాక కేసీఆర్ కొడుకు కేటీఆర్ బీజేపీ పార్టీపై విమ్మర్శలు చేస్తున్నారని, కేంద్రప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పార్టీ ఏం చేసిందో మీ అయ్యను అడుగు చెబుతాడని యద్దేవా చేశారు. ఈజీఎస్ నిధులను రాష్ట్రానికి ఇవ్వలేదా..? జాతీయ రహదారులు రాష్ట్రానికి ఇవ్వలేదా..? ఉచిత బియ్యం రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదా..? ఆరోగ్యమిషన్ కిందా ప్రభుత్వాసుపత్రులకు నిధులు ఇవ్వలేదా.? అని ప్రశ్నించారు. కేటీఆర్ కు దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్దమా..? అని సవాల్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది..? రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో బహిరంగ చర్చకు సిద్దమా..? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమి లేదన్నారు. రోడ్లతో అభివద్ది జరిగినట్టేనా..? అని ప్రశ్నించారు.

also read :-ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి ఒకరు మృతి: ముగ్గురికి తీవ్ర గాయాలు

అభివద్ది అంటే ఏమిటో మంత్రి కేటీఆర్ కు తెలుసా..? అని ప్రశ్నించారు. అసలు ప్రగతిభవన్ కు పోనీ సీఎం కేసీఆర్ కు అభివద్ది అంటే ఏమిటో ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. 8ఏండ్ల కాలంలో ఒక్క రోజు కూడా ప్రగతి భవన్ కు పోనీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆ ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఫామ్ హౌజ్ లో కుర్చున్న సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగించకుండా ప్రధాని నరేంద్రమోధీని, బీజేపీ ప్రభుత్వాన్ని, అంబేద్కర్ రాసిన గౌరవమైన రాజ్యాంగాన్ని, రాజ్యంగ పదవిలో ఉన్న గవర్నర్ ను విమర్శిస్తుంటారని అన్నారు. వీరికి రాజ్యంగంపై గౌరవమే లేదన్నారు. థర్డ్ ప్రంట్ పెడతానన్న సీఎం కేసీఆర్ ఏ గూట్లో దాక్కున్నాడో..? చెప్పాలని అన్నారు. థర్డ్ పంట్ పెట్టిన, పార్టీలన్నింటిని కలుపుకున్న బీజేపీ పార్టీని ఏం చేయలేరన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువ సీట్లతో కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రాబోతుందని, 2024 ఎన్నికల్లో బీజేపీ కమలం జెండా ఎగరేయబోతుందని స్పష్టం చేశారు.

== గణేష్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యే

గణేష్ ఆత్మహత్య చేసుకోలేదని, ప్రభుత్వమే హత్య చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డ ఆరోపించారు. దేశభక్తి గల నిజాయతీ కల్గిన సాయిగణేష్ తప్పులు చేస్తున్న, ప్రజావ్యతిరేక పరిపాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని, మంత్రిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడమేంటని ఆరోపించారు. కేటీఆర్ వస్తున్నాడని అరెస్టు చేసిన పోలీసులు నెలలో మూడు సార్లు జైలుకు పంపించడమేంటని ప్రశ్నించారు. పోలీసులు మంత్రి పువ్వాడ చెప్పినట్లు ఆడుతూ అక్రమ కేసులు బనాయిస్తుండటం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. పోలీసులు ఎంత వేదిస్తే సాయిగణేష్ ఆత్మహత్య చేసుకుంటాడో..? అర్థం చేసుకోవచ్చన్నారు. పోలీసులకు అంత అవసరం లేదన్నారు. పోలీసులు ప్రభుత్వానికి కొంత చూపించాలే కానీ అంతా వాళ్లే అన్నట్లుగా పరిపాలన చేయోద్దని సూచించారు. పోలీసులు లక్ష్మణ రేఖను దాటి పనిచేస్తున్నరని, లక్ష్మణ రేఖను దాటోద్దని సూచించారు. తద్వారా పోలీసులపై గౌరవం పోతుందని, హత్యా రాజ్యం వస్తుందన్నారు. గణేష్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గణేష్ ఎక్కడైతే ఆత్మహత్య చేసుకున్నాడో, అక్కడే టీఆర్ఎస్ ను బొందబెట్టేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.

== మంత్రిపై కేసు ఎందుకు పెట్టలేదు…?

సాయిగణేష్ చనిపోయే ముందు మీడియాతో మాట్లాడి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కార్పోరేటర్ వల్లనే నేను ఆత్మహత్య చేసుకున్నాని మరణ వాగ్ములం ఇచ్చాడని, కానీ పోలీసులు ఎందుకు మరణవాగ్ములం తీసుకోలేదని మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సాయి చనిపోయిన తరువాత సావిత్రమ్మ ఫిర్యాదు ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదో..? పోలీసులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అందుకే పోలీసులపై నమ్మకం పోయిందని, హైకోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణకు లేదంటే సిట్టింగ్ జడ్జీతో విచారణకు డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అంతు తెలుస్తామని, అంతా చిట్టా తయారైందన్నారు. మంత్రి భూ కబ్జాలు, అవినీతి అక్రమాలు అన్నింటిని బయటకు తీస్తామన్నారు. పువ్వాడను భర్తరఫ్ చేసే వరకు వదిలేది లేదని స్పష్టం చేశారు. ఖమ్మంలో అభివద్ది చేశామని సంకలు గుద్దుకునే పువ్వాడ అజయ్, నువ్వేంత అభివద్ది చేశావో ప్రజలు చూస్తునే ఉన్నారని అన్నారు. ఖమ్మం జిల్లా అభివద్ది తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా చేసినప్పుడు జోరుగా అభివద్ది జరిగిందన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పీకిందేమి లేదన్నారు. మంత్రి పువ్వాడ రౌడీ పాలనకు అంతం తప్పదని, ఆయన జైలుకు పోవుడు ఖాయమన్నారు. సాయిగణేష్ కుటుంబానికి అండగా ఉంటామని హామినిచ్చారు.

== మంత్రిని వదిలిపెట్టేదే లేదు : బండి సంజయ్

బీజేపీ కార్యకర్త ఆత్మహత్యచేసుకోడానికి ప్రత్యక్ష,పరోక్షంగా కారణమైన మంత్రి పువ్వాడ అజయ్ ను అరెస్టు చేసే వరకు, మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసే వరకు వదిలేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. సంతాప సభ సందర్భంగా ఆయన వీడియో కాల్ లో మాట్లాడుతూ నిజాయితీ కల్గిన గొప్ప కార్యకర్త సాయిగణేష్ అని, అలాంటి కార్యకర్తపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పోలీసులు అక్రమ కేసులు బనాయించి, ఇష్టానుసారంగా చిత్రహించలు, మానసిక హింసకు పాల్పడి ఆత్మహత్య చేసుకునే విధంగా ఇబ్బందులు పెట్టారని అన్నారు. ఖమ్మంలో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంత్రికి ఊడిగం చేస్తున్నారని, అలాంటి పోలీసులపై గౌరవం పోతుందన్నారు. సాయిగణేష్ ఆత్మహత్యకు కారణమైన ఏ ఒక్కర్ని వదిలేది లేదని, పోలీసులపై నమ్మకం లేక న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగిందన్నారు. హైకోర్టు పై నమ్మకం ఉందని, కచ్చితంగా న్యాయం గెలుస్తుందని తెలిపారు. సాయిగణేష్ లాంటి కార్యకర్తను కోల్పోవడం దురద్రుష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామినిచ్చారు. సాయిగణేష్ అనే వ్యక్తిని తీసుకరాలేకపోవచ్చు కానీ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకోస్తామని హామినిచ్చారు. ఇప్పటికే యువకులందరు సాయిగణేష్ లా పోరాటం చేసేందుకు సిద్దమైయ్యారని, ఇక కేసీఆర్ సర్కార్ కు అంతం తప్పదన్నారు.

== సాయిగణేష్ ఆత్మహత్యకు బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి : జేపీ నడ్డా

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్యకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా డిమాండ్ చేశారు. సంతాప సభ సందర్భంగా ఆయన వీడియో సందేశాన్ని పంపించారు. సాయిగణేష్ లాంటి నిజాయతీ కల్గిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కోల్పోవడం బాధకరమన్నారు. తెలంగాణ లో రౌడీ రాజ్యం నడుస్తోందని, అక్రమ పాలకుల అవినీతి రాజ్యం నడుస్తోందన్నారు. పోలీసులు మంత్రులకు ఊడిగం చేయాల్సిన అవసరం లేదని, పోలీసులు తమ విధులను మర్చిపోవద్దని సూచించారు. సాయిగణేష్ ఆత్మకు శాంతి చేకూరాలంటే ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తపై ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్, రాష్ట్ర కిషాన్ మోర్చ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు పొంగులేట సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎం. ధర్మారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వరావు, నాయకులు కొనగంచి, వెంకటగుప్తా, ఉదయ్ ప్రతాఫ్, దొంగల సత్యనారాయణ, కొనేరు చిన్ని, కమర్లపూడి ఉపేందర్, ప్రతాఫ్, శ్యామ్ రాథోడ్, శ్యామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.