8ఏళ్లలో తెలంగాణలో ఏం ఉద్దరించావో..?
== గుణాత్మక పాలన అంటే కుటుంబ పాలనా..!
== సర్జికల్ స్టయ్రిక్స్ ప్రూఫ్‌లు అడిగే వ్యక్తికి దేశ సమగ్రత తెలుసా
== సిఎం కెసిఆర్ విమర్శలపై ఘాటుగా స్పందించిన కిషన్ రెడ్డి
(హైదరాబాద్-విజయం న్యూస్);-
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన నాటినుంచి నేటి వరకు 8ఏళ్ల కాలంలో తెలంగాణకు ఎలాంటి న్యాయం చేశావో..? ప్రజలకు ఎలాంటి పథకాలను అందించావో..? అసలు తెలంగాణలో ఏం ఉద్దరించావో చెప్పాలని, బీజేపీ అంటే టిఆర్‌ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం భయపడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబీకుల మాటలు, తీర్మానాలు అభూత కల్పనలని ఆయన విమర్శించారు. గురువారం ఢల్లీిలో విూడియాతో మాట్లాడుతూ దేశాన్ని ఉద్ధరించేది టీఆర్‌ఎస్, కేసీఆర్ కుటుంబమే అని మాట్లాడుతున్నారని, తెలంగాణలో 8 ఏళ్లుగా టీఆర్‌ఎస్ ఏం ఉద్ధరించిందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.
also read :-హక్కు పరిరక్షణ సమితి ములుగు జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన మాదరి శ్రీకాంత్
ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్, గుణాత్మక మార్పు అని కేసీఆర్ మాట్లాడారని చెప్పారు. గుణాత్మకమైన పరిపాలన అంటే..కుటుంబ పాలనా? అని ప్రశ్నించారు. పుల్వామా సర్జికల్ స్టయ్రిక్స్ ఆధారాలు కోరిన వ్యక్తి దేశ సమగ్రత గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. గుణాత్మకమైన పరిపాలన అంటే ఏంటనేదానికి అర్థం చెబుతూ సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి ఎలాంటి పదవులు ఉన్నా తమకు అభ్యంతరం లేదంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫ్రంట్‌లు, టెంట్‌లు పెట్టుకోవచ్చని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి ఎలాంటి పదవులు ఉన్నా.. భాజపాకు అభ్యంతరం లేదని చురకలంటించారు. గుణాత్మకమైన పరిపాలన అంటే… కేసీఆర్ కుటుంబ పాలననా అని ప్రశ్నించారు. గుణాత్మకమైన పరిపాలన అంటే అవినితీ పాలననా? అంటూ విమర్శలు చేశారు.
also read :-ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ
కేసీఆర్ ఎనిమిదేళ్లు తెలంగాణను ఉద్దరించినట్లు మాట్లాడుతున్నారన్న ఆయన… గుణాత్మకమైన పరిపాలన అంటే కల్వకుంట్ల కుటుంబపాలననా అని నిలదీశారు. గుణాత్మకమైన పరిపాలన అంటే కేసీఆర్ అవినీతి పాలనా? గుణాత్మకమైన పరిపాలన అంటే అహంకారపూరితమైన పాలనా? గుణాత్మకమైన పరిపాలన అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే అవకాశవాదన పాలననా? గుణాత్మకమైన పరిపాలన అంటే అప్పులు చేసే పాలనా? గుణాత్మకమైన పరిపాలన అంటే అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాలరాసేపాలననా? గుణాత్మకమైన పరిపాలన అంటే ఆఫీసు రాని పాలనా? గుణాత్మకమైన పరిపాలన అంటే నిజాం రాజ్యంలాంటి పాలననా? గుణాత్మకమైన పరిపాలన అంటే తండ్రి, కుమారుల పాలననా?అంటూ విమర్శలు సంధించారు.