ఈ ప్రభుత్వం శ్రీవారి దర్శనం నుండి భక్తులను దూరం చేస్తుంది….!!
—-తితిదే అసలు ఏం చేస్తోంది:- చంద్రబాబు
(అమరావతి-విజయంన్యూస్);-
అమరావతి:-తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నిర్ణయాలు భక్తులకు శ్రీవారిని దూరం చేసేలా ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.మొదటి నుంచి ఇదే తరహా అలసత్వం తితిదేలో కనిపిస్తోంది.తిరుమలను ఆదాయ వనరు కోణంలోనే తితిదే చూస్తోంది.
also read;-తొలి ప్రసంగంలోనే కశ్మీర్ పై నోరు పారేసుకున్న పాక్ ప్రధాని షెహ్ బాజ్
క్యూలైన్లో గంటల తరబడి అవస్థపడుతుంటే తితిదే ఏంచేస్తోంది.మండుటెండలో పసిబిడ్డలతో భక్తులు అవస్థలు పడుతున్నారు.భక్తులకు సౌకర్యాలు కల్పించకపోవడం దారుణం.కొండపైకి వెళ్లేందుకు ఆంక్షలేంటి…?
భక్తులకు తితిదే క్షమాపణలు చెప్పి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.