Telugu News

ఆర్వోబి నిర్మాణం ఎప్పుడు…?

58 కోట్ల ఆర్వోబీ నిర్మాణ నిధులు ఏమైనట్లు...?

0

ఆర్వోబి నిర్మాణం ఎప్పుడు…?

—58 కోట్ల ఆర్వోబీ నిర్మాణ నిధులు ఏమైనట్లు…?

—జిల్లా కాంగ్రేస్ నాయకులు డా. మురళీ నాయక్

(మహబూబాబాద్-విజయం న్యూస్);-

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లాస్ట్ గేట్ వద్ద ఆర్వోబి నిర్మాణం ఎప్పుడు చేపడతారని జిల్లా కాంగ్రెస్ నాయకులు డా. మురళీ నాయక్ ప్రభ్యత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్వోబీ నిర్మాణం జరగాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించిన అనంతరం గ్రీవెన్ సెల్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.ఈసందర్భంగా డా. మురళీ నాయక్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ స్థాయినుండి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ జిల్లా కేంద్రంగా మారిన మహబూబాబాద్ లో ప్రజల సౌకర్యార్థం పోలీస్ క్వార్టర్స్ చివరి గేటు వద్ద ఆర్వోబి నిర్మాణం చెయ్యాలనే ప్రతిపాదన కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. 2015లో యాభై ఎనిమిది కోట్లు మంజూరి అయినా కూడా ఇంత వరకూ ఆర్వోబీ ఊసే లేక పోవడం దురదృష్టకరమన్నారు.

also read :-2566 వ బుద్ధ జయంతి ఉత్సవంలో పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య

నిధులు మంజూరైన వెంటనే రైల్వే, ఆర్ అండ్ బి అధికారులు సంయుక్తంగా సర్వే చేసి చివరి గెట్ నుండి కొద్ది దూరంలో మూడు చోట్ల ఆర్వోబి నిర్మాణం చెయ్యొచ్చనే ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య, అధికారుల మధ్య సరైన సయోధ్య కుదరక పోవడంతో ఇంత వరకూ ఆర్వోబి నిర్మాణం జరగలేదన్నారు. ప్రజల కష్టాలను తీర్చాల్సిన నాయకులు తమలో తాము పైచేయి సాధించుకునేందుకు ప్రజల రక్షణను పణంగా పెట్టి రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. అరేండ్ల కింద విడుదలైన ఆ యాభై ఎనిమిది కోట్ల నిధులు ఉన్నాయో… లేక వేరేవాటికి ఖర్చు పెట్టారేమో అనే అనుమానం కలుగుతోందన్నారు. రెండు దశాబ్దాల కింద ఊరవతల కురవి, ఎల్లందు రోడ్లను కలుపుతూ నిర్మించిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి కేవలం గుత్తేదారుల జేబులు నింపడానికే పనికి వచ్చిందని ఎద్దేవా చేశారు.

also read :-పల్లె ప్రకృతి వనం అగ్నికి ఆహుతి..!

పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని పదేండ్ల కింద నిర్మించిన అండర్ బ్రిడ్జి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదన్నారు. మానుకోటలో ఏ నిర్మాణం చేపట్టినా అందులో ప్రజల బాగు కంటే కాంట్రక్టర్లు, ప్రజాప్రతినిధుల క్షేమమే ఎక్కువగా కనిపిస్తుందన్నారు. మానుకోటలో జరిగే అభివృద్ధి ప్రజలకంటే ప్రజాప్రతినిధులకె ఎక్కువ లాభం జరుగుతోందన్నారు. మానుకోట జిల్లాలో గల్లీ లీడర్ల కాంచి ఢిల్లీ లీడర్లున్నా ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. నాటి కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ఆశలను ఆకాంక్షను తీర్చాయన్నారు. ఇప్పటికైనా రైల్వే గేటు వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు ప్రత్యామ్నాయంగా ఆర్వోబీ నిర్మించి తీరాలని హెచ్చరించారు. లక్ష జనాభాకు తోడు జిల్లా నలుమూలల నుండి విద్య, వైద్యం, ఉద్యోగం కోసమే కాకుండా వ్యాపారులు, రైతులు అనునిత్యం వచ్చి పోతుంటారన్నారు. రోజూ వేలాది వాహనాలకు ఈ రైల్వే గేటే ఆధారమన్నారు. విపరీతమైన వాహన రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్వోబీ నిర్మాణం చెయ్యాలనే ప్రజల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోందన్నారు.

also read:-అమిత్ షాపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్

ఆర్వోబీ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించి ఆ దిశగా ప్రజలను ఏకం చేస్తామన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు సోయి తెచ్చుకొని ప్రజల ఆకాంక్షలకు అనుగూనంగా పనిచేయాలని హితవు పలికారు. ప్రజా సనస్యల గొంతుక తానై కాంగ్రెస్ పార్టీ అనునిత్యం ప్రజల కోసం పోరాడుతుందని… అందుకు కాంగ్రెస్ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు శంతన్ రామరాజు, నీరుటి లక్మి నారాయణ, బాణోత్ ప్రసాద్, రమేష్ , దళ్ సింగ్, సల్వాది దిలీప్ తదితరులు పాల్గొన్నారు.