Telugu News

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : మంత్రి

★ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా

0

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : మంత్రి

★ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందేశం

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి అజయ్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మార్పు రావాలంటే మహిళలు ఒక ప్రణాళికా బద్దమైన కార్యచరణతో ముందుకు సాగాలన్నారు. సీఎం కేసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు.

also read :-*ఉక్కు కర్మాగారం స్థాపించాల్సిందే: కూనంనేని

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ఇతర ప్రాంతాలు అమలు చేయాలని చూస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో రాష్ట్రంలో 10 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లినపుడే ఉన్నత శిఖరాలు అధిరో హిస్తారన్నారు. ప్రస్తుతం ప్రతీ రంగంలోనూ మహిళలు ఉన్నారని, వారి పాత్ర కీలకంగా మారిందని మంత్రి అన్నారు. స్వయం ఉపాధి కల్పన రంగాలతోపాటు వ్యాపార రంగాల్లోనూ ఎదగాలని ఆకాంక్షించారు. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిని అందిపుచ్చుకొని అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఆడపిల్లలను భారంగా భావించకుండా అదృష్టంగా భావించాలన్నారు.

also read :-తెలంగాణ ప్రజల ఆత్మబంధువు కేసిఆర్ : మంత్రి అజయ్ కుమార్

టీఆర్‌ఎస్‌ పాలనలో మహిళలకు మంచిరోజులు వచ్చాయన్నారు. రాజకీయంగా వారికి గుర్తింపు లభించిందన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం చేయూతనిచ్చిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మంచినీటి కోసం వీధి పంపుల వద్ద పోట్లాట జరిగిందన్నారు. ఇప్పుడు ఇంటింటికీ తాగునీరు అందుతుండడంతో ఇబ్బందులు తప్పాయన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు దేశావ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు.

మహిళలు, బాలికల అభివృద్ధికి ప్రభుత్వం విశేష ప్రాధాన్యమి స్తోందన్నారు. ఇప్పటికే అనేక రంగాల్లో తమ కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహిళలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చదువు, ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి అన్నారు.

also read :-మెడికల్ కళాశాల ఏర్పాటు నిర్ణయం పట్ల పొంగులేటి హర్షం

ప్రస్తుతం పరిస్థితులు మారాయని, సమాజంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానులేనని పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ అందరికీ సమానంగా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. మహిళా ఆలోచనలో విప్లవాత్మకమైన మార్పు రావాలని అన్నారు.

ఏ రంగంలో చూసినా మహిళలు రాణిస్తున్నారని, నేల నుంచి ఆకాశ మార్గంలో విమానాలు నడిపే వరకు మహిళలు దూసుకుపోతున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించటంతో పాటు నామినేటేడ్‌ పదవుల్లో, పోలీస్‌ నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళలకు పెద్దపీట వేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.