పినపాక పై ఎందుకు గురి..?
== ఎవరికోసం ఆరాటం..ఎందుకు పోరాటం..?
== పొలిటికల్ అట్రాక్షన్ గా నిలుస్తున్న నేత
== అడ్డుకుంటున్న తగ్గని జనాధారణ
(విజయం న్యూస్ ఖమ్మం):-
ఎన్నో అవమానాలు.. ఎన్నో అభ్యంతరాలు.. అనేక సార్లు అడ్డుకోవటాలు.. ఆందోళనలు.. ఆయనతో ఎవరు పోవద్దని అంక్షలు.. అయినప్పటికి ఆయనకు తగ్గని జనాధరణ.. ఆయన అభిమానమే జనహితం.. ఆయన వస్తున్నాడంటే జనసందోహమే..? అందుకే ఆయన ప్రస్తుతం పొలిటికల్ కే అట్రాక్షన్ అయ్యారు.. ఎక్కడ చూసిన ఆయన నామస్మరణే.. అలాంటి నాయకుడు ఒక్క నియోజకవర్గంపై ప్రధానంగా ద్రుష్టి పెట్టారు.. లేస్తే ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.. ప్రజలను కలుస్తున్నారు.. అసక్తికరమైన ప్రకటనలు చేస్తున్నారు..? కానీ ఇదంతా పార్టీ తరుపున చేయడం లేదు.. పర్సనల్ గా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు.. ఎందు కోసం..? ఎవరి కోసం ఆపర్యటన.. ఆ నియోజకవర్గంపై ఎందుకు గురి పెట్టారు.. ప్రజల్లో వస్తున్న ఆధారణ సంగతేంటి..? అసలు విషయం చూడాలంటే ముందుగా ‘విజయం’ తెలుగు దినపత్రిక అందిస్తున్న కథనం చదవాల్సిందే..?
టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉంటున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులే కాకుండా అన్ని పార్టీల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.. ఎందుకంటే ఆయన వారిపై చూపిస్తున్న ప్రేమ, అప్యాయత కూడా అలాగే ఉంటాయి. ఎవర్ని కాదనడు. పిలిచిన, పిలవకపోయిన అందరు నావాల్లే అనుకుంటాడు. అవకాశం వచ్చినప్పుడల్లా అభిమానులందర్ని కలుస్తుంటాడు. పంక్షన్లకు, పెళ్లీళ్లకు వెళ్తుంటాడు. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, లాభమొచ్చిన ఆయనను తలుచుకుంటారు.
also read;-బహుత్ అచ్చా ==అకట్టుకుంటున్నరఘునాథపాలెం బృహత్ పల్లెప్రకృతి వనం
ఆయన వద్దకు వెళ్తుంటారు.. ఆయన అంతే మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. అప్యాయతను రంగరించి పోస్తాడు.. ఆయన అందించే అభిమతం అభిమానులను ఫిదా చేస్తుంది. అందుకే ఆయనంటే చచ్చేంత అభిమానం ప్రజలకు. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయనకు మస్తుగా అభిమానులు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో పర్యటించిన, ఏ మండలంలో తిరిగిన వందలాధి మందిజనం నిరాజనం పలుకుతారు. అందుకే అందరివాడు శీనన్న అని అంటుంటారు.. కోపం ఉండదు.. ప్రేమ తప్ప, అక్రోసం ఉండదు.. అభిమానం తప్ప, అవమానించడం ఉండదు.. అభిమానించడం తప్ప, ఆవేశం ఉండదు.. అదుకోవడం తప్ప, అలాంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక్క నియోజకవర్గపై గురి పెట్టినట్లు కనిపిస్తోంది.. అక్కడక్కడే పదేపదే పర్యటిస్తున్నారు.. అభిమానులను మరింతగా పెంచుకుంటున్నారు.. అందర్ని కలుస్తున్నారు.. అప్యాయతగా పలకరిస్తున్నారు. అవసరాన్ని భట్టి సహాయం చేస్తున్నారు. ఎందు కోసం..? ఎవరిపై కోపం..? ఎందుకా పర్యటనలు..?
== పినపాకపై ఎందుకు గురి..?
ఎక్కడ తగ్గాలో కాదు. ఎక్కడ నెగ్గాలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాగా తెలుసు. అవమానం చవిచూసిన చోటే అఖండ ఆదరణ పొంది దటీజ్ పొంగులేటి అని నిరూపించుకున్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిథిలోని కరకగూడెం, పినపాక మండలాల్లో జరిగిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన అభిమానులు ఆశించిన దానికంటే ఎక్కువ రావడం.. అనుకున్నదానికంటే పర్యటన సూపర్ సక్సెస్ కావడం అందుకు నిదర్శనంగా మారింది.. పొంగులేటి పర్యటనకు పోవద్దు అంటూ గులాబీ నేత హుకూం జారీచేసినా కార్యకర్తలు గుంపులు,గుంపులుగా రావడం, పొంగులేటి పట్ల కొండంత అభిమానం చూపించడం గమనార్హం. ఆ నియోజకవర్గంలో పొంగులేటి శీనన్న పట్టున్న నాయకుడని మరోమారు రుజువైంది.
also read;-చనిపోదాం అనుకున్నవాడు… సీఎం అయ్యాడు!
పినపాక నియోజకవర్గంలో గెలుపు, ఓటమిలను ప్రభావితం చేయగల నాయకుడనే చర్చ రాజకీయ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ అనుకూల, ప్రతికూల పరిస్థితులను అంచనా వేయగల సమర్థత కలిగిన ఆయన ఏ విషయంలో తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేయడంలో దిట్ట. ఆ క్రమంలోనే అభిమానుల బలం, ప్రజాదరణ అధికంగా ఉన్న పినపాక నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి ఈసారి తన అనుచరుడిని అసెంబ్లీకి పంపాలనే పట్టుదల, కసి కనిపిస్తోంది.
== నమ్మిన వారికి భరోసానిచ్చేందుకేనా…?
కష్టమొచ్చినా, నష్టమొచ్చినా అధైర్య పడకండి. అండగా ఉంటానంటూ కార్యకర్తలకు భరోసా కల్పించి నడిపించే నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అభిమానులు నమ్ముతారు. అందుకే జనం ఆయన పర్యటనలో ప్రవాహంలా పాల్గొని వెన్నంటే నడుస్తారు. పదవుల దర్పం కంటె ప్రజాభిమానమే ముఖ్యమని నమ్మే పొంగులేటి జనహృదయ నేత అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. పలకరింపులు, పరామర్శలు, ఆర్థిక సహాయం చేస్తూ తనదైన శైలిలో ఆత్మీయతని పంచే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజమైన ప్రజా నాయకుడు అనేది జనవాక్కు. ఆయన టీఆర్ఎస్‌లో కొనసాగినా లేదా భవిష్యత్తులో మరో పార్టీ జెండా పట్టుకున్నా ఆయన అభిమానులంతా వెన్నంటే నడుస్తారనేది యధార్థం. ఆయన ఎటువైపు అడుగులు వేస్తే తమ అడుగులు అటువైపే అని అభిమానులు చెప్పడం పొంగులేటికి ఉన్న ప్రజాదరణకు నిదర్శనం. అందుకే ఆయన ఉమ్మడి ఖమ్మం రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయనే కీలకం అనేది జనాభిప్రాయం. అందుకే అందరి చూపు ఇపుడు పొంగులేటిపై పడింది. ఆయన తీసుకొనే నిర్ణయాలపైనే ఆసక్తి నెలకొంది.
== పినపాకలో తన ముద్రపడేనా..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పినపాక. ప్రస్తుతం ఆయన మూడు పదవులతో ఆ జిల్లాకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు.. దీంతో ఆయనకు అద్భుతంగానే ప్రజాధరణ ఉంది. ఆయనంటే పడి చచ్చే కార్యకర్తలు ఉన్నారు. మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్న సమయంలో ఓ విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రజాధరణ కల్గిన నేత పొంగులేటికి ఆయనకు మధ్య వార్ నడిచింది.. అప్పటి నుంచి ఆ ఇద్దరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.. ఆయన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావును ప్రోత్సహిస్తున్నారనే ఆలోచనతో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మొదటి నుంచి కొంత గుర్రుగానే ఉన్నారు. కాగా ఎన్నికలు సమీపిస్తుండటం, ఆయనకు చెప్పకుండా నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో చిర్రేక్కిన రేగా, పొంగులేటి పై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఏర్పడింది.
also read;-ఖమ్మంలో ఎంపీ నామ విస్తృత పర్యటన
ఈ క్రమంలో చాలెంజ్ వరకు వెళ్లింది.. దీంతో పొంగులేటి ఆగ్రహించి ఆయన సంగతేంటో చూడాలని తన వర్గీయులకు, అభిమానులకు చెప్పినట్లు తెలుస్తోంది.. అందుకే పినపాకపై గురిపెట్టి నిత్యం కార్యక్రమాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ అదిష్టానం అనుమతి లేకుండా, జిల్లా పార్టీ అనుమతి లేకుండా వారానికి ఒకసారి నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలను ఐక్యం చేసే పనిలో నిమగ్నమైయ్యాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన అనుచరుడు పాయం వెంకటేశ్వర్లు కంటే ముందుగా రేగా కాంతారావును ఓడించాలనే లక్ష్యంగా కార్యక్రమాలు చేస్తున్నట్లుగానే నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అయితే ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు కీలక నాయకులు పోరుతో ఆ నియోజకవర్గంలోని గులాబీ శ్రేణుల్లో ఆందోళన నేలకొంది. ఇలాగే మున్ముందు వర్గపోరు కీలకంగా ఉంటే టీఆర్ఎస్ పార్టీని కార్యకర్తలు వీడే అవకాశం ఉందని నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు బహాటంగానే చెబుతున్నారు. మొత్తానికి ప్రజాధారణ కల్గిన ఇద్దరు నేతలు పోట్లాటలో ఎవరిది పై చెయ్యి అవుతుందో చూడాలి..?