Telugu News

మణుగూరులో రూ.2.90కోట్ల భారీ కుంబకోణం

*   1 కోటి నలభై నాలుగు లక్షల 2 వేల సొత్తు రికవరీ

0

2.9 కోట్ల భారీ మొత్తంలో కుంభకోణం

*   1 కోటి నలభై నాలుగు లక్షల 2 వేల సొత్తు రికవరీ
*.  బ్యాంకు మేనేజర్ తో సహా నలుగురు నిందితుడు అరెస్ట్
*  ప్రముఖ పాత్ర పోషించిన మణుగూరు ఏ ఎస్ పి
*    సీఐ, ఎస్ఐలను పనితీరు భేష్ సిఐ ఎస్సైల పనితీరు భేష్
*   ఎస్పీ సునీల్ దత్ వెల్లడి
(మణుగూరు- విజయం న్యూస్):
భద్రాద్రి కోపరేటివ్ బ్యాంకు లో భారీ కుంభకోణం జరిగింది. ఇట్టి కుంబకొణంపై భ్రద్రాద్రి  కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ స్థానిక మణుగూరు ఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ మణుగూరు లో గత నెల 24వ తేదీన భారీ సొత్తు కుంభకోణం జరిగిందని భద్రాద్రి కోపరేటివ్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మణుగూరు ఏఎస్పీ శబరిష్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సొమ్ము దుర్వినియోగం చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిలో .పందుల రాము మేనేజర్ , యస్ కే.అక్బర్ అసిస్టెంట్ మేనేజర్ చిట్టిపోగు రామారావు  క్యాషియర్ గనిబోయిన రవీంద్ర కుమార్  అటెండర్ భారీ కుంభకోణం కేసులో అరెస్టై చేశారు. బ్యాంకుకు చెందిన 2.9 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయగా దానిలో  ఒక కోటి నలభై నాలుగు లక్షల రెండు వేల రూపాయలు రికవరీ చేసినట్లు తెలిపారు.  దోచు కున్న సొమ్ము ఆధారంగా వీరిని  243/2021 U/Sec 409, 420, 120 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని తెలిపారు.
విచారణ సమయంలో నిందితుడిని పట్టుకుని వారిని విచారణ  చేయగా గత  రెండు సంవత్సరాల నుంచి వారు నగదు డిపాజిట్లను  స్వంత వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించుకున్నట్లు వెల్లడించారు. నలుగురు వ్యక్తులు ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. నిందితుడు ఏ1 నుంచి ఏ4 సహకారంతో నిధులను దుర్వినియోగం చేశారు. ఈ నగదును నకిలీ బ్యాంకు ఖాతాలను  నిర్వహించి సొమ్ము కాజేసారు.. సెప్టెంబర్8 న ఏ1 మేనేజర్ ని అరెస్ట్ చేసి జుడిషియల్ కస్టడీ కి అప్పగించారని చెప్పారు. ఈరోజు   ఏ2 నుండి ఏ4 లను అరెస్ట్ చేసి  కోర్టు ముందు హాజరు పరచనున్నారు.  ఏ1, ఏ4  నుంచి  1,44,02,000  మొత్తం సొత్తును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సొమ్ము రికవరీ లో సీఐ భాను ప్రకాష్, ఎస్ ఐ నరేష్, కానిస్టేబుల్ మోహన్, బాబు , రవీంద్ర ,బిక్కు లను ఎస్ పి  సునీల్ దత్ అభినందించారు..