Telugu News

చత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్..ముగ్గురు మహిళ మావోయిస్టులు మృతి

కొనసాగుతున్న కాల్పులు

0

*ఛత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్*

*ముగ్గురు మహిళ మావోయిస్టులు మృతి..?*

*కొనసాగుతున్న కాల్పులు..*

(చర్ల -విజయం న్యూస్)

చతీస్ ఘడ్ రాష్ట్రంలో మరోసారి కాల్పుల మోత మోగింది.. గత రెండు రోజుల క్రితమే చత్తీస్ ఘడ్ రాష్ట్రం, దంతేవాడ జిల్లాలోని అద్వాల్ – కుంజేరా గ్రామాల మధ్యలోని అడవుల్లో ఎన్ కౌంటర్ జరగ్గా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, సోమవారం తెల్లవారుజామున మరో ఎన్ కౌంటర్ జరిగింది. దంతేవాడే లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరగ్గా,  ముగ్గురు మహిళ మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.. పక్క సమాచారం తో ఎస్ఓటీ పోలీసు గాలింపు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎదురుకాల్పులు జరగ్గా, ఈ కాల్పుల్లో రాజే ముచికి, గీతం మార్కం, జ్యోతి అనే మహిళ మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం.వారి వద్ద నుంచి బారీగా తుపాకులను, సామాగ్రిని పోలీసులు స్వాదీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Also read :- 14మంది మావోయిస్టులు లొంగుబాటు