ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం
లాయర్ దుస్తుల.లో వచ్చి కాల్పులు జరిపిన ఓ గ్యాంగస్టర్
35నుంచి 40కాల్పులు జరిపిన దుండగులు
(ఢిల్లీ-విజయం న్యూస్)
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం మరోసారి సంచలనం రేపుతోంది.. ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఈ కాల్పులు జరిగాయి. మధ్యాహ్నం 2.40గంటల సమయంలో రోహిణి కోర్టులోని 207 రూమ్ లో ఓ కేసు విషయంలో జితేందర్ అనే వ్యక్తి రాగా.. ఆయనపై దుండుగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.. లాయర్ వేషం లో వచ్చిన ఓ గ్యాంగ్ వేగంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.. 35 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరిపి జితేందర్ ను హతమార్చినట్లు సమాచారం. రెండు గ్యాంగుల మధ్య చాలా కాలంగా వైరం ఉన్నట్లు తెలుస్తోంది.. జితేంద్ర పై కాల్పులు జరిపిన సంఘటనలో జీతెందర్ సహా మొత్తం నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది..మరో మృగ్గురికి గాయాలైయ్యాయి.. జితేందర్ పై కాల్పులు జరిపింది టిల్లు గ్యాంగ్ గా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగుతుంది.. పోలీసులు అప్రమత్తమైయ్యారు.. రాజధానిలో పోలీస్ గస్తి కొనసాగుతోంది. వివరాలు ఇంకా తెలియాల.సి ఉంది..