Telugu News

మృతి చెందిన ప్రేమ జంట.

అశ్వారావుపేట విజయం న్యూస్.

0

ప్రేమ జంట ఆత్మ హత్య…

* భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట బస్టాండ్ లో ప్రేమ జంట ఆత్మహత్య యత్నం…

*చికిత్స పొందుతూ ప్రభుత్వ హాస్పటల్ లో ఇద్దరు మృతి…

*ప్రేమ జంటను గమనించిన బస్ డ్రైవర్ కండక్టర్..

(అశ్వారావుపేట -విజయం న్యూస్)

అశ్వారావుపేట నియోజకవర్గంలోని చండ్రుగొండ మండలం సీతాయి గూడెం గ్రామానికి చెందిన జగ్గారావు(28) మైనర్ బాలిక అనూష(14) అనే ఇద్దరు గత కొంతకాలంగాప్రేమించుకుంటున్నారు..అయితే జగ్గారావు కి వివాహం అయి ఇద్దరి పిల్లలు కూడా ఉన్నారు,జగ్గారావు ఆటో నడుపుతుంటాడు.అనూష జగ్గారావు ప్రేమ వ్యవహారం బయటపడటంతో అనూష ని పెద్దలు మందలించడంతో జగ్గారావు అనూష గత రెండురోజుల క్రితం కనిపించకుండా వెళ్లిపోయారు..
గత రెండు రోజుల క్రితం చండ్రుగొండ పోలీస్ స్టేషన్ లో అనూష కనిపించడంలేదని అనూష కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు. అలానే జగ్గారావు కుటుంబ సభ్యులు కూడా అదే పోలీస్ స్టేషన్ లో కనిపించడంలేదని పిర్యాదు చేశారు..చండ్రుగొండ పోలీసులు మిస్సింగ్ కేసుగా కేసు నమోదు చేశారు.
ఈ రోజు సాయంత్రం 4:00 గంటల సమయంలో అశ్వారావుపేట బస్టాండ్ ఆవరణంలో కూర్చొని ఆగిఉన్నా బస్ లో అనూష జగ్గారావు ఎక్కి పురుగులు మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డారు.ఆత్మహత్య కు పాల్పడినట్టు గమనించిన బస్ డ్రైవర్ కండక్టర్ ప్రభుత్వ హాస్పటల్ కి తరలించారు.. చికిత్స చేస్తుండగా ఇద్దరు మృతి చెందారు. అశ్వారావుపేట పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

also read :- హుజురాబాద్ ఎఫెక్ట్ – ఈటలను కలిసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్.

 

allso read:- తెరుచుకున్న శబరిమల ఆలయం.. నిబంధనలు పాటించాల్సిందే..!