Telugu News

చాగల్లు వద్ద ఆగిఉన్న టూరిస్ట్ బస్సును ఢీ కొన్న లారీ.

*ప్రమాదంలో 7గురికి గాయాలు.

0

చాగల్లు వద్ద ఆగిఉన్న టూరిస్ట్ బస్సును ఢీ కొన్న లారీ.
*ప్రమాదంలో 7గురికి గాయాలు.
*బాధితులు హసన్ పర్తి మండలం దేవన్నపేట వాసులుగా గుర్తింపు.
*బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశం.

జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం చాగల్లు వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యచికిత్స కోసం యంజియం అసుపత్రికి తరలించారు.

సమాచారం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఘటనలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని యంజియం వైద్యాధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు కమీషనర్ ను అడిగి తెలుసున్న మంత్రి దయాకర్ రావు ప్రమాద బాధితులకు అవసమైన సహాయం అందించాలని సూచించారు. బాధితులు హసన్ పర్తి మండలం దేవన్నపేట గ్రామానికి చెందిన వారుగా తెలిసింది.

also read :- పోచారం మ‌న‌వ‌రాలి వివాహ వేడుక‌లో తెలంగాణ‌, ఏపీ సీఎంలు.