అనస్థీషియా హై డోస్ హడావుడిగా ఆపరేషన్లు
పరిస్థితి విషమించి బ్రెయిన్‌డెడ్
కొత్తపేట్ ఓజోన్ ఆస్పత్రితో దారుణం
(ఎల్బీనగర్ -విజయం న్యూస్):-
ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేటలోని ఓజోన్ హాస్పటల్‌లో దారుణం చోటు చేసుకుంది. అనస్థీషియా అధికంగా ఇవ్వడంతో ఓ మహిళ బ్రెయిన్‌డెడ్‌కు గురైంది. దీంతో `ఠాగూర్` సినిమాను తలపించే మాదిరిగా ఆపరేషన్ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చిన ఆసుపత్రి వైద్యులు చివరికి పేషెంట్ కోమాలోకి వెళ్లిపోయిందని చేతులేత్తేశారు. వనస్థలిపురంకు చెందిన వజ్రమ్మ (52) ఈ నెల 27వ తేదీ ఆదివారం చెవి నొప్పతో బాధపడుతూ ఓజోన్ హాస్పటల్‌లో వచ్చింది.
also read :-టిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు: కండువ కప్పి స్వాగతం పలికిన రేగా
చెవికి సర్జరీ చేయాలని ఆస్పత్రి వైద్యులు ఆమెను ఆడ్మిట్ చేసుకున్నారు. సోమవారం ఆమె చెవికి సర్జరీ చేసేందుకు ఆస్పత్రి వైద్యులు అనస్థీషియా హై డోస్ ఇచ్చారు. దీంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. మత్తు మందు అధికంగా ఇవ్వడంతో బ్రెయిన్ డెడ్‌కు గురై కోమాలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా వెంటిలేటర్‌పై వైద్యం చేస్తున్నట్లు నమ్మించారు. వైద్యులను నిలదీయడంతో చేసేది లేక పేషెంట్ బాడీ అనస్థీషియాకు సహకరించకపోవడంతో బ్రెయిన్‌కు గురైందని చేతులెత్తేశారు.
also read:-కష్టాలు వచ్చిన ఎప్పుడు చిరునవ్వు తో స్వాగతం పలికే మహానుభావుడు మన రతన్ టాటా
అయితే కుటుంబ సభ్యులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యం వల్లే వజ్రమ్మ కోమాలోకి వెళ్లిపోయిందని ఆరోపిస్తూ హాస్పటల్ ముందు ఆందోళకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవరించిన హాస్పటల్ యాజమాన్యంపై చట్టరిత్యా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరడానికి ముందు ఎంతో ఆరోగ్యంగా ఉందని తెలిపారు. అబ్ధుల్లాపూర్ మెట్ ప్రభుత్వ పాఠశాలలో హిందీ పండిట్ టీచర్‌గా విధులను నిర్వహిస్తుందని, కేవలం చెవి నొప్పతో ఓజోన్ హాస్పటల్‌కు వస్తే ఇంత దారుణం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ కొత్తపేట్ ఓజోన్ ఆసత్రిలో ఇలాంటి ఘటనలు జరిగిన విషయం గమనార్హం. ఈ హాస్పటల్‌పై చర్యలు తీసుకోవాలని పలు ప్రజా సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.