Telugu News

ఏపిలో కరోనా విలయతాండవం

= విజయవాడ ఆస్పత్రిలో కరోనా కలకలం..

0

ఏపిలో కరోనా విలయతాండవం
== విజయవాడ ఆస్పత్రిలో కరోనా కలకలం..
== వైద్యులు సహా 50 మంది సిబ్బందికి పాజిటివ్‌
== భయాందోళనలో బెజవాడ జనం
(విజయవాడ-విజయంన్యూస్)
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది.. కరోనా పల్లెపల్లెన విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగు తూనే ఉంది. ఈ క్రమంలో సాధారణ ప్రజలతోపాటు.. పలువురు నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. వారికి వైద్యం అందించే డాక్టర్లు కూడా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగి స్తోంది. థర్డ్‌వేవ్‌ ప్రారంభమైన అనంతరం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున డాక్టర్లు కరోనా బారిన పడుతు న్నారు. తాజాగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపింది.

also read :-దేశంలో విజృంభిస్తోన్న కరోనా

ఆసుపత్రిలోని మొత్తం 50 మంది వైద్యసిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో సహా 25మంది వైద్యులు, ఇతర పారామెడికల్‌ సిబ్బందికి కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవికిరణ్‌కు కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయనతో పాటు మరో 25 మంది జూనియర్‌ డాక్టర్లు, ఇతర వైద్యులకు పాజిటివ్‌ అని తేలింది. అలాగే పారామెడికల్‌ సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వాస్పత్రిలో మొత్తం 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.

also read :-317 రద్దు చేయకపోతే రోడ్డు పడతాం

ఇంత మంది వైద్యులు కరోనా బారిన పడటంతో ఆస్పత్రిలో మిగిలిన వైద్యులు, రోగులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఆసుపత్రిలో పెద్ద ఎత్తున వైద్యులకు, సిబ్బందికి కరోనా సోకడంతో రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 22,882 శాంపిల్స్‌ ని పరీక్షించగా 4,108 మందికి కోవిడ్‌19 పాజిటివ్‌ అని తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2110388కి చేరింది. ఊరట కలిగించే విషయం ఏంటంటే.. ఎవరూ కూడా కరోనాతో చనిపోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14510గా ఉంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 30182 యాక్టివ్‌ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 696 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2065696కి చేరింది.