Telugu News

ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్.

గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

0

ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్.

గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ మరియు చెన్నరావుపేట పోలీసులు సంయుక్తం కల్సి అరెస్ట్ చేయగా మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు.

అరెస్టు చేసిన నిందితుల నుండి సుమారు 5లక్షల 30వేల రూపాయల విలువగల 53కిలోల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో సోయం వీరబాబు, తండ్రి పేరు ముత్తయ్య, చింతూరు, ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్, సమీర్ హల్దార్, తండ్రి సంతోష్ హల్దార్, కలిమెల మండలం,మల్కాజ్గిరి జిల్లా, ఒడిషా రాష్ట్రానికి చెందిన వారు కాగా పరారైన వారిలో కోస్రా రాజు ఆలియాస్ శుశాంక్ రాజు చింతూరు, ఈస్ట్ గోదావారి, ఆంద్రప్రదేశ్ మరియు మల్కాజ్గిరి ఒడిషా రాష్ట్రానికి చెందిన మొడం ముత్త, కొతన్ దుర్గాలు వున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు నిందితులతో పాటు, ప్రస్తుతం పరారీలో వున్న ముగ్గురు నిందితులు ఒక ముఠా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఈ ముఠా సభ్యులు ఆంధ్రప్రదేశ్ లోని చింతలూరు, ఒడిషా రాష్ట్రంలోని మల్కాజ్గిరి ప్రాంతాల్లో రహస్యంగా సేకరించిన గంజాయిని మధ్యవర్తుల ద్వారా తెలంగాణ
మీదుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహరాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు రహస్యంగా ఎవరికి అనుమానం రాకుండా గంజాయిని తరలించేవారు. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ కు చెందిన ఒక స్సగర్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ ముఠాలోని సభ్యులు సోయం వీరబాబు,
కోస్రా రాజు, సమీర్ హల్దార్ మధ్యప్రదేశ్ కు చెందిన స్మగ్లరుకు నెక్కొండ ప్రాంతంలో గంజాయిని అందజేసేందుకుగాను ఈ ముగ్గురు నిందితులు 53 కిలోల గంజాయిని రెండు కిలోలు మరియు ఐదు కిలోల ప్యాకేట్ల రూపంలో రెండు ద్విచక్ర వాహనాలపై రాజమండ్రి, భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లందు, నర్సంపేట, మీదుగా నెక్కొండకు వస్తున్నట్లుగా టాస్క్ఫరకు సమాచారం అందడంతో టాస్క్ఫర్స్ పోలీసులు స్థానిక చెన్నారావుపేట పోలీసులతో కల్సి చెన్నరావుపేట గ్రామ శివారు ప్రాంతంలో ఈ రోజు ఉదయం తనీఖీ నిర్వహిస్తు సమయంలో ద్విచక్రవాహనాలపై వస్తున్న నిందితులను చూసి అనుమానంతో వాని అపడంతో ద్విచక్రవాహనంపై వెనుకు కూర్చున్న కోస్రా రాజు తప్పించుకోని పారిపోగా మరో ఇద్దరు స్మగ్లర్లు పోలీసులకు చిక్కారు. వీరి ద్విచక్ర వాహనంపై వున్న ప్యాకేట్లను పోలీసులు పరిశీలించగా వాటిలో వున్నది గంజాయి వున్నట్లుగా గుర్తించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. తప్పించుకొని పారిపోయిన మరో నిందితుడు గురించి పోలీసులు చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారని పోలీస్ కమిషనర్ తెలియజేశారు.

*ఈ అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, నెక్కొండ ఇంచార్జ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఏసిపి తిరుమల్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు సంతోష్, శ్రీనివాస్ జీ, ఎస్.ఐలు లవణ్ కుమార్, రవళి, చెన్నరావుపేట ఎస్.ఐ మహేందర్,
టాస్క్ఫ ర్స్ హెడ్ కానిస్టేబుల్ సోమలింగం, కానిస్టేబుల్లు రాజేష్, రాజు, శ్రవణ్ కుమార్, శ్రీనివాస్, ఆలీ,విజయ్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు.

also rread ;-మంత్రి ఎర్రబెల్లి మా దళితుల భూమిని ఇప్పించండి.