Telugu News

మహిళా ఆసియా కప్ మనదే

7వ సారి ట్రోఫి కైవసం చేసుకున్న భారత్ మహిళ క్రికెట్ టీమ్

0

మహిళా ఆసియా కప్ మనదే

== పైనల్లో లంకపై ఘనవిజయం సాధించిన టీమీండియా

== 7వ సారి ట్రోఫి కైవసం చేసుకున్న భారత్ మహిళ క్రికెట్ టీమ్

== అభినందనలు వెల్లువ

(క్రీడావిభాగం-విజయంన్యూస్)

మహిళా ఆసియా కప్ మనమ్మాయిలకే కైవసం అయ్యింది.. ఏళ్ల తరబడి ఆ కప్ ను కైవసం చేసుకుంటున్న మన అమ్మాయిలు 2022 ఆసియా కప్ ను కూడా కైవసం చేసుకున్నారు. ఆసియా కప్ లో పురుషుల జట్టు త్రీవగా నిరాశ పరిచినా..మహిళలు మాత్రం అదరగొట్టేస్తున్నారు. సూపర్ ఫామ్ ను కొనసాగించిన భారత్ మహిళ జట్టు ఆసియా కపట్ టోర్నిలో తన అధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు. మొత్తం ఆసియాకప్ 8 సార్లు జరిగితే అందులో 7 సార్లు టీమీండియా విజేతగా నిలిచింది. మహిళ ప్రపంచకప్ లో టీమీండియా తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది..

allso read- నేటి నుంచి ప్రపంచకప్ టీ20 క్రికెట్ ఆరంభం

ప్రపంచ దేశాలు కూడా మహిళ జట్టుపై ప్రశంసలు కురిపించలేకుండా ఉండలేకపోతున్నారు. శనివారం శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమీండియా మహిళ జట్టు అద్భుతంగా రాణించింది. 8 వికేట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. స్క్రుతి మంధాన అర్థసెంచరీతో చేలరేగి ఆడగా, 66 పరుగుల లక్ష్యాన్ని కేవలం 8.3 ఓవర్లలోనే 2 వికేట్ల నష్టానికి చేదించింది. దీంతో 7వ సారి ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. వరసగా ఐదు సార్లు భారత్ టీమ్ తో పైనల్ మ్యాచ్ లో తలపడిన శ్రీలంక.. నాలుగు సార్లు ఓడిపోయింది.. ఐదవ సారైన కసితో ఆడుతుందని అందరు భావించారు. కానీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. భారత్ మహిళ జట్టు బోలింగ్ విభాగంలో అద్భతంగా రాణించారు. రేణుకసింగ్(3/5), రాజేశ్వరి గైక్వాడ్(2/16) స్నేహ్ రాణా(2/13)రాణించడంతో శ్రీలంక జట్టు 65 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 66 పరుగుల విజయలక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ మహిళా జట్టు కేవలం 8.3 ఓవర్లలోనే అద్భుత విజయం సాధించింది. దీంతో భారత్ అభిమానులు మహిళ జట్టుకు అభినందలు తెలుపుతున్నారు.

allso read- బెంగాల్ అధ్యక్షుడిగా దాదా..?