Telugu News

బెంగాల్ అధ్యక్షుడిగా దాదా..?

ప్రయత్నాల్లో నిమగ్నమైన గంగూలీ

0

బెంగాల్ అధ్యక్షుడిగా దాదా..?

== ప్రయత్నాల్లో నిమగ్నమైన గంగూలీ

(క్రీడా విభాగం-విజయంన్యూస్)

బీసీసీఐ అధ్యక్షుడిగా నిష్రమించిన సౌరభ్ గంగూలీ తిరిగి బెంగాల్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా అవతారం ఎత్తాలనే ప్రయత్నాల్లో నిమగ్నమైయ్యాడు. అతి త్వరలో బెంగాల్ సంఘానికి అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యాడు. ఈ మేరకు సౌరబ్ గంగూలీ స్వయంగా ప్రకటించాడు. క్యాబ్ అధ్యక్షుడిగా బరిలో నిలిచేందుకు సిద్దంగా ఉన్నానని, అతి త్వరలోనే నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. గతంలో 2015 నుంచి 2019 వరకు బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా పనిచేయగా, ఆ తరువాత బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైయ్యాడు. కాగా ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా నిష్ర్కమించిన అనంతరం తిరిగి బెంగాల్ అధ్యక్షుడిగా రంగంలోకి దిగాలనే ప్రయత్నాలు చేస్తున్నడు. ఈనెల 22న నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అందుకు గాను తన ప్యానల్ ను తయారు చేసుకునే పనిలో నిమగ్నమైయ్యాడు.

allso read- నేటి నుంచి ప్రపంచకప్ టీ20 క్రికెట్ ఆరంభం