ఆటోను డీ కొట్టిన బొలెరో వాహనం…..
***ఇద్దరికి తీవ్రగాయాలు…. ఐదుగురికి స్వల్ప గాయాలు……..
***ఆపకుండా వెళ్ళిన బొలెరో డ్రైవర్….
(విజయం న్యూస్):-
క్షతగాత్రులను 108 వాహనంలో ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలింపు…….. వాజేడు మండలం సుందరయ్య కాలనీ, దూల పురం గ్రామాల మధ్య వెంకటాపురం నుంచి వస్తున్న ఆటోను, వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం వెనకనుంచి ఢీకొట్టడంతో ఆటో పల్టీ కొట్టి రోడ్డు పక్కన పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి.
also read :-కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ :
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో 108 వాహనంలో ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు తరలించారు. ఆటోను ఢీకొట్టిన బొలెరో వాహనం డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్ళిపోయాడు. మండలంలో కృష్ణాపురం గ్రామానికి చెందిన సబ్కా సర్వేష్ కు చెందిన ఆటో వెంకటాపురం నుండి కృష్ణాపురం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది..