Telugu News

ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించి సహకరించాలి : ట్రాఫిక్ ఏసీపీ

ఫుట్ పాత్ లపై చిరు వ్యాపారులకు అవగాహన

0

ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించి సహకరించాలి : ట్రాఫిక్ ఏసీపీ

> ఫుట్ పాత్ లపై చిరు వ్యాపారులకు అవగాహన
> ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేలా అన్ని చర్యలు..
> సహకరించకపోతే జరిమానాలు తప్పవు.
> NTR సర్కిల్ వద్ద జరుగుతున్న ప్రమాదాల నివారణ చర్యలు.

ఫుట్ పాత్ ల ఆక్రమణ కారణంగా రోడ్లపై పాదచారులకు, ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న క్రమంలో వాటిని స్వచ్చందంగా తొలగించాలని ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ చిరు వ్యాపారులకు సూచించారు.తరచూ NTR సర్కిల్ వద్ద జరుగుతున్న ప్రమాదాల పై R&B డిఈ సూరిబాబుతో కలసి సందర్శించారు. సర్కిల్ వద్ద ప్రమాదాలు నియంత్రించేందుకు నేషనల్ హైవే అధికారులతో చర్చించి చర్యలు తీసుకోనున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు.

ఆనంతరం
నగరంలోని పాత బస్‌స్టాండు, కమన్ బజార్ ,బోమ్మన సెంటర్ , కస్బాబజార్లో వున్న ఫుట్ పాత్ లపై చిరు వ్యాపారులు నిర్వహిస్తున్న వారికి అవగాహన కల్పించారు. రోడ్లపై వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న క్రమంలో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ ల ఆక్రమణల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వారికి అర్ధమయ్యే విధంగా వివరించారు. పాదచారులు నడవడానికి ఏర్పాటు చేసిన వ్యాపారాలను స్వచ్చందంగా తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా తమతో సహకరించాలని కోరారు.

పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే విధంగా అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఫుట్ పాత్ లను ఖాళీ చేసి మరోచోట వ్యాపారాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించకపోతే జరిమానాలు తప్పవని ఆయన తెలిపారు. ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించి ప్రజలు, వాహన దారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాము తీసుకుంటున్న చర్యలకు చిరు వ్యాపారులు సైతం సహకరించాలని ఆయన కోరారు.కార్యక్రమంలో సిఐ అంజలి,సురేష్ పాల్గొన్నారు.

also read :- సోమగూడెం లో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి