Telugu News

రాఘవపై కుట్రలు పన్నారు : వనమా వెంకటేశ్వరరావు

మా పార్టీ వారే కుమ్మక్కై విరికించారు

0

రాఘవపై కుట్రలు పన్నారు : వనమా వెంకటేశ్వరరావు
== మా పార్టీ వారే కుమ్మక్కై విరికించారు
== నాకుమారుడి రాజకీయ జీవితం పై మచ్చ తెచ్చారు
== కుట్రలు చేసిన వారిని వదిలేది లేదు
== సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే వనమా
(భద్రాద్రికొత్తగూడెం-విజయంన్యూస్);-
నేను లేని సమయంలో నా కుమారుడు రాఘవపై కొందరు మా పార్టీ నాయకులు కుట్రపన్ని కేసులో విరికించారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సంచనల ఆరోపణలు చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన నాగ రామక్రిష్ణ కుటుంబం ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో జైలుకు వెళ్లిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు, టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేంద్ర 61 రోజుల పాటు జైల్లో ఉన్నారు. కాగా గురువారం ఆయన షరత్తులతో కూడిన బెయిల్ పై విడుదలైయ్యాడు. కాగా ఈ విషయంపై స్పందించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శనివారం అసెంబ్లీ లాబీలో విలేకర్లతో మాట్లాడుతూ కొంత మంది టీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు.

also read :-— జోరుగా మాస్ కాపీయింగ్

నాకు గత మూడు నెలలుగా ఆరోగ్యం బాలేదని, ఆ సమయంలో నా కుమారుడు వనమ రాఘవేంద్ర అన్ని తానై పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉన్నారని, వార కష్టాల్లో పాలుపంచుకున్నాడని తెలిపారు. దీంతో తన కుమారుడు రాజకీయంగా ఎదుగుతున్నాడని భావించిన కొందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓర్వలేక రాజకీయంగా అణగదొక్కాలనే ఆలోచనతో అనేక ప్రయత్నాలు చేశారని తెలిపారు. కానీ నేను అందుబాటులో లేని సమయంలో ఆ నాయకులు ఇదే అదునుగా భావించి తన కుమారుడ్ని ఓ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఈ విషయంలో టీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీ నాయకులతో కుమ్మకై కుట్రపన్ని మరీ జైలుకు పంపించారని పేర్కొన్నారు. ఇది ఎవరు చేశారో నాకు బాగా తెలుసని, అందరి బండారం బయటపెట్టేదాక వదలనని అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులతో కొందరు కుమ్మక్కైన వారిని వదలబోనని స్పష్టం చేశారు.

also read :-రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.

రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టించి ఇరికించారని ఆరోపించారు. త్వరలోనే అన్ని విషయాలు, నిజనిజాలు బయటపెడతానని వనమా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారాయి. ఇప్పటికే వర్గపోరుతో తలలు పట్టుకుంటున్న టీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం వనమా రాఘవ పై కేసు సంఘటనలో జిల్లా టీఆర్ఎస్ కు మరో తలనొప్పి అయ్యింది.. అయితే ఇప్పుడు వనమా వెంకటేశ్వరరావు చేసిన సంచలన ఆరోపణలు ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నాయకులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది.